మోదీకి ఆ దేశ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ఘనస్వాగతం

ఇజ్రాయెల్ చేరుకున్న ప్రధాని మోదీ

ఇజ్రాయెల్ : ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఆ దేశ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ఘనస్వాగతం పలికారు. నెతన్యాహు మోదీకి హిందీలో స్వాగతం పలకడం విశేషం. ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు. ఇజ్రాయెల్‌లో మూడు రోజుల పాటు మోదీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సైబర్ భద్రత, నవ కల్పనలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సహకారంపై ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరగనున్నాయి. ద్వైపాక్షిక, ఆర్థిక అంశాల బలోపేతంపై చర్చించనున్నారు.
మోదీకి నిండు మనసుతో స్వాగతం పలుకుతున్నామని నెతన్యాహు చెప్పారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను అమితంగా గౌరవిస్తామని తెలిపారు. ఇజ్రాయెల్‌కు భారత ప్రధాని రాక కోసం ఏడేళ్లుగా ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు నెతన్యాహు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు