హరితహారం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావలి: కడియం
జనగామ లో మూడవ విడత హరితహారం కార్యక్రమాన్ని అధికారికంగా మొక్కలు నాటి ప్రారంభించారు. వ్యవసాయ మార్కెట్ కమిటి ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమoలో మొక్కలు నాటిన అనంతరం జరిగిన సమావేశంలో శ్రీ కడియం శ్రీహరి మాట్లాడుతూ ముందుగా జిల్లా కలెక్టర్ ఇలాంటి సమాజహిత కార్యక్రమాల అమలు చేయడంలో చూపిస్తున్న ఉత్సాహాన్ని అభినందించారు. రాష్ట్రంలో అటవీ శాతాన్ని 33కు పెంచి, వలసలు తగ్గించడానికి, వర్షపాతం పెంచడానికి ఉద్దేశించి అమలు చేస్తున్న ఈ కార్యక్రమంలో జనగాం జిల్లా ప్రజలందరు భాగస్వామ్యులై విజయవంతం చేయాలని అన్నారు. అయిదు సంవత్సరాలలో 230 కోట్ల మొక్కలు పెంచే లక్ష్యంలో 100 కోట్లు అటవీభూములలో మరో వందకోట్ల అటవీయేతర భూములలో మొక్కలు పెంచడం జరుగుతుందని అన్నారు. కరువు పీడిత ప్రాంతం అయిన జనగాoలో మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా సురక్షిత త్రాగునీరందిoచనున్నట్లు గత సంవత్సరం దేవాదుల ద్వారా చెరువులతో నీటిని నింపుకొని పంటల ఉత్పత్తి గణనీయనంగా పెంచుకున్నామని అన్నారు. అలాగే జిల్లాలో రెండు ప్రధాన రహదారులైన హైదరాబాద్- భూపాలపట్నం, సిద్ధిపేట- సూర్యాపేటల ద్వారా త్వరలో ఔటర్ రింగ్ రోడ్ రానున్నదని ఆయన వివరించారు. ఈ నెల 15వ తేదిన రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో గ్రీన్ డే గా పరిగణించి మొక్కలు నాటనున్నామని, పోలీసు స్టేషన్లను కూడా పచ్చదనంతో నిoపనున్నామని తెలిపారు. మొక్కలు నాటడమే గాక సoరక్షించుకోవాల్సిన భాద్యత ప్రతి ఒక్కరి పై ఉందని దానికి గాను హరిత దళాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. జనగాంకు హరితహారం ఒక వరమని, గొప్పగా వినియోగించుకోవాలని అన్నారు
అనంతరం
జిల్లాలో అటవీశాతాన్ని పెంచేందుకు, సమృద్ధిగా వర్షాలు కురిసేందుకు చేపట్టిన సీడ్ బాల్స్ (విత్తన బంతులు) కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా భాగాస్వామ్యులైనారు. బుధవారం జిల్లాకు వచ్చిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి జనగాం మండలంలోని ఎర్రగొల్లపహాడ్ గ్రామం చేరుకొని అక్కడవున్న గుట్టలపైన విత్తనబంతులను వదిలారు. ప్రభుత్వ విప్ బి.వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జి.పద్మ, శాసనసభ్యులు ఎం. యాదగిరిరెడ్డి, జిల్లా కలెక్టర్ ఎ.శ్రీదేవసేనలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విత్తన బంతులను గుట్టలపైకి వదిలారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు కూడా హాజరయ్యారు.
Comments
Post a Comment