హ్యాట్సాఫ్ సార్
తిరువనంతపురం : ఓ పోలీసు అధికారి అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నాడు. పోలీసు ఆఫీసర్ చూపిన మానవత్వం పట్ల ప్రశంసల జల్లు కురుస్తుంది. కేరళ పతనంతిట్ట జిల్లా పులికీజ్హు పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ దుకాణం వద్ద జూన్ 29న ఓ వ్యక్తి చనిపోయాడు. వ్యక్తి మృతి చెందిన సమాచారాన్ని దుకాణ యజమాని పోలీసులకు చేరవేశాడు. దుకాణం వద్దకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసు ఆఫీసర్ పీఎన్ సుదర్శన్ మృతదేహం ఫోటోను మీడియాలో ప్రకటన ఇచ్చారు. నాలుగు రోజులు గడిచినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. వివరాలేమి లభించలేదు.
దీంతో సుదర్శనే ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. స్థానిక అధికారుల అనుమతి మేరకు.. జులై 4న సుదర్శన్ ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నాడు. ఇప్పుడు ఈ సంఘటన సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. పోలీసు అధికారి సుదర్శన్‌పై ప్రశంసల వర్షం కురుస్తుంది. హ్యాట్సాఫ్ సార్ అంటూ సుదర్శన్‌ను అభినందిస్తున్నారు.

Comments
Post a Comment