మళ్లీ ఐపీఎల్‌లోకి చెన్నై సూపర్ కింగ్స్

మళ్లీ ఐపీఎల్‌లోకి చెన్నై సూపర్ కింగ్స్... సంబరాల్లో అభిమానులు!

న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. రెండేళ్ల నిషేధం ముగియడంతో తిరిగి ఐపీఎల్‌లో అడుగుపెట్టేందుకు చెన్నై జట్టు సిద్ధమైంది. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ ట్విటర్ వేదికగా తమ ఆటగాళ్లకు స్వాగతం పలికింది. ‘‘సింహాలకు శుభోదయం..! ఎట్టకేలకు ఎదురుచూపులు ముగిశాయి. మళ్లీ ఎదిగేందుకు, దేదీప్యమానంగా వెలిగేందుకు సమయం వచ్చింది..’’ అని ట్వీట్ చేసింది.
ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విశేష అభిమానాన్ని సొంతం చేసుకున్న సంగత తెలిసిందే. టీ20 జట్లలో మంచి దూకుడు మీదున్న టీమ్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో ఏటేటా సత్తా చాటుకుంటూ వచ్చింది. అయితే చెన్నై, రాజస్థాన్ రాయల్స్ జట్ల యాజమాన్యాలు బెట్టింగ్‌కు పాల్పడినట్టు వెలుగుచూడడంతో ఈ రెండు జట్లపై రెండేళ్ల పాటు నిషేధం పడింది. దీంతో 2016, 2017 ఐపీఎల్ సీజన్లకు ఇరుజట్లు దూరం జరగాల్సి వచ్చింది. గురువారం నాటికి నిషేధం ముగియడంతో... సోషల్ మీడియా వేదికగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు