పిల్లలను పెంచినంత జాగ్రత్తగా మొక్కలను పెంచాలి.సిఎం కేసిఆర్
ప్రకృతిని పూజిస్తే హర్షిస్తది, వర్షిస్తది: కేసీఆర్
కరీంనగర్‌లో మూడో విడుత హరితహారాన్ని ప్రారంభించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పిల్లలను పెంచినంత జాగ్రత్తగా మొక్కలను పెంచాలని, మొక్కలను కాపాడటం ప్రాథమిక బాధ్యతగా భావించాలని తెలిపారు. కరీంనగర్ నుండి ఏ పని ప్రారంభించినా విజయమవతుందని, హరితహారం కూడా చాలా పెద్ద విజయవంతమవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.
అలాగే మొక్కతోనే మన జీవితం పెనవేసుకొని ఉందని, ఊగే ఊయల, మోసే పాడె వరకు చెట్టుతోనే ముడిపడి ఉంటుందని, ప్రకృతిని పూజిస్తే హర్షిస్తది, వర్షిస్తది అని చెప్పారు. తెలంగాణ పచ్చగా మారేందుకు అందరూ కృషి చేయాలని, ప్రజాప్రతినిధులు పూనుకుంటే పట్టణాలు పచ్చబడతాయని తెలిపారు. ఇక మొక్కలు నాటడం ప్రభుత్వ కార్యక్రమంగా భావించకుండా, ఇందులో అందరూ భాగస్వామ్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతి ఊరిలో 51మందితో గ్రీన్‌బ్రిగేడ్ ఉండాలని పేర్కొన్నారు.

Comments
Post a Comment