మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి… మొక్కు చెల్లించుకున్నా ఎంపీ కవిత

అమ్మవారికి బోనం సమర్పించిన ఎంపీ కవిత…


సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తెల్లవారు జామునుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు… భక్తులతో పాటు వీఐపీల కూడా భారీగా తరలివస్తున్నారు. నిజమాబాద్‌ ఎంపీ కవిత… మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి… మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు సతీమణి శోభ పట్టువస్త్రాలు అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ… అమ్మవారికి బోనం సమర్పించడం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అమ్మవారి దయతో తెలంగాణ రాష్ట్రం మొత్తం బాగుండాలని కోరుకున్నారు ఎంపీ కవిత… మహిళలు ఘనంగా బోనాలు జరుపుకుంటున్నారని ఆమె తెలిపారు. ఎంపీ కవితతో పాటు బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కూడా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు