జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరపాలని ప్రజాప్రతినిధులకు లేఖ:కేటీఆర్

ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రాష్ట్ర చేనేత-జౌళిశాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరపాలని ప్రజాప్రతినిధులను లేఖలో కోరారు. ఈ సందర్భంగా చేనేత అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను వివరించారు. వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద ఉపాధిరంగం చేనేత పరిశ్రమని, వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నదని తెలిపారు. నేతన్నల ఆదాయం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 2015 ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది. గత రెండేళ్లుగా రాష్ట్రంలో చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ ఏడాది మరింత ఘనంగా చేనేత దినోత్సవాన్ని నిర్వహించాలని పేర్కొన్నారు.
చేనేత వస్ర్తాలు, పరిశ్రమలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. గత నెలలో శాస్త్రీయంగా సర్వే నిర్వహించి 17 వేల మగ్గాలున్నట్లు ప్రభుత్వం గుర్తించిందని వెల్లడించారు. ఈ సర్వే తర్వాత సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు టెక్స్‌టైల్స్ చేనేతశాఖ తరపున అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించామన్నారు. నేతన్నకు చేనేత పొదుపు పథకం, యార్న్ సబ్సిడీ, పావలా వడ్డీ పథకం, బ్లాక్ లెవల్ క్టస్టర్లు ఏర్పాటు వంటి కార్యక్రమాలను చేపట్టామన్నారు. చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత వస్ర్తాలను ధరించి చేనేత రన్, ర్యాలీలు నిర్వహించాలన్నారు. ప్రముఖ చేనేత కార్మికులు, డిజైనర్లను సన్మానించడంతో పాటు చేనేత వస్ర్తాల స్టాల్స్‌ను ఏర్పాటు చేయాలని తెలిపారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు