యాదాద్రి ఆలయంలో స్వామివారికి లక్ష పుష్పార్చన

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఉదయం స్వామివారికి బాలాలయంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య లక్ష పుష్పార్చన కన్నుల పండుగగా నిర్వహించారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్ద ప్రసాదాలు అందించి స్వామివారి ఆశిస్సులు అందజేశారు. కల్యాణ మూర్తులను ఊరేగించి నిత్య కల్యాణోత్సవాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. కల్యాణంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి శేష వస్ర్తాన్ని అందించి ఆశీర్వచనం చేశారు. శ్రీ సత్యనారాయణ వ్రత మండపంలో సత్యదేవునికి భక్తులు వ్రత పూజలు .
నిత్య పూజలు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఉదయం 4 గంటలకే పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. 4 గంటలకు సుప్రభాతం, 4.30 గంటలకు తిరువారాధన, 5 గంటలకు బాలభోగం, ఉద యం 6.15 గంటలకు తులసీఅర్చన, 7 గంటల నుంచి ఉభయ దర్శనాలు మొదలవుతాయి. 7:30 నుంచి 8:15 వరకు నిజాభిషేకం, 10 నుంచి 12 గంటల వరకు నిత్యకల్యాణం, మధ్యాహ్నం 12 గంటలకు నివేదన, సాయంత్రం 5గంటలకు నిత్యాలంకర తిరువీధి సేవ, రాత్రి 7 గంటలకు ఆరాధన, 7.30 గంటలకు తులసీకుంకుమార్చనలు, ఆంజనేయస్వామి వారికి సహస్రనామార్చనలు, 9గంటలకు ఆరగింపు, 9.45 గంటలకు శయనోత్సవం జరుగుతాయి. కొండపై శ్రీ పర్వతవర్థినీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉదయం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు పూజలు కొనసాగుతాయి.
పాతగుట్ట గుడిలో...
పాతగుట్ట ఆలయంలో నిత్యపూజలు యథావిధిగా కొనసాగుతాయి. ఉదయం 5 గంటలకు సుప్రభాతం, 5.45గంటలకు బిందె తీర్థం, 6.15 గంటలకు ఆరాధన, ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు దైవదర్శనాలు, 8 గంటలకు అభిషేకం, 8.30 గంటలకు అర్చన, మధ్యాహ్నం 12 గంటలకు ఆరగింపు, ఉదయం 9.30 గంటలకు, 11 గంటలకు, సాయంత్రం 4.30 గంటలకు శ్రీ సత్యనారాయణస్వా మి వ్రతాలు కొనసాగుతాయి. సాయంత్రం 5.30 గం టలకు అలంకార సేవలు, రాత్రి 7.30 గంటలకు నివేదన, 8 గంటలకు ఆలయ బంధనం జరుగుతుంది.

Comments
Post a Comment