వీఎన్‌ఆర్‌ విజ్ఞాన జ్యోతి కళాశాల విద్యార్ధుల కుటుంబాలకు పరిహారమివ్వండి : సుప్రీం

విద్యార్ధుల కుటుంబాలకు పరిహారమివ్వండి : సుప్రీం


ఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్‌లో తెలుగు విద్యార్థుల మృతిపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. 2014లో వీఎన్‌ఆర్‌ విజ్ఞాన జ్యోతి కళాశాల విద్యార్థులు విహార యాత్రకు వెళ్లి అక్కడ మృత్యువాత పడిన ఘటన సంచలనం సృష్టించింది. అయితే, ఈ ఘటనకు సంబంధించి హిమాచల్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. విద్యార్థుల మృతి నేపథ్యంలో వారికి పరిహారం చెల్లించాలని హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ అక్కడి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సోమవారం విచారించిన జస్టిస్‌ ఎన్వీ రమణ ధర్మాసనం ఆ ఘటనకు హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టంచేసింది.
ప్రభుత్వం తప్పిదం వల్లే విద్యార్థులు చనిపోయారని తేల్చిచెప్పింది. సైరన్‌ వేసినా విద్యార్థులు పట్టించుకోలేదన్న ప్రభుత్వ వాదనపై స్పందిస్తూ.. ఎత్తు నుంచి నీరు విడుదల చేస్తే సైరన్‌ ఎలా వినబడుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఒక్కో విద్యార్థికి రూ.25లక్షల చొప్పున చెల్లించాలని ఆదేశించింది. దీంతో హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఆరు నెలల గడువు కోరగా.. మూడు నెలల్లో పరిహారం చెల్లించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది.
హిమాచల్‌ప్రదేశ్‌లోని కులుమనాలిలో 2014లో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన హృదయాలను కలిచివేసింది. బాచుపల్లికి చెందిన వీఎన్‌ఆర్‌ విజ్ఞాన్‌ జ్యోతి ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన 48 మంది విద్యార్థులు విజ్ఞాన యాత్రలో భాగంగా కులుమనాలికి వెళ్లారు. అయితే, అక్కడ లార్జి డ్యాం గేట్లు ఎత్తడంతో 24 మంది విద్యార్థులు బియాస్‌ నదిలో గల్లంతయ్యారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు