జరబద్రం..సరైన టికెట్ లేకుండా రైల్లో ప్రయాణిస్తే ఇక అంతే

న్యూఢిల్లీ: సరైన టికెట్ లేకుండా రైల్లో ప్రయాణిస్తే ఇక అంతే సంగతి. స్టేషన్ నుంచి బయటకు వెళ్ళలేక ఇట్టే దొరికిపోతారు. టికెట్ లేకుండా ప్రయాణించే వారిని అరికట్టేందుకు రైల్వే శాఖ తగిన చర్యలు చేపడుతోంది. దీని కోసం ఆధునిక టెక్నాలజీని వినియోగించనుంది. ఇకపై టికెట్లపై బార్ కోడ్ ముద్రించనుంది.
అలాగే రైల్వే స్టేషన్లలో ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయనుంది. అక్కడ టికెట్లను స్కాన్ చేసే పరికరాలుంటాయి. దీంతో సరైన టికెట్ ఉంటేనే బయటకు వెళ్ళేందుకు అవితెరుచుకుంటాయి. ఢిల్లీలోని పలు రైల్వే స్టేషన్లలో తొలుత ప్రయోగాత్మకంగా వీటిని ఏర్పాటు చేస్తారు. అనంతరం అన్ని రైల్వే స్టేషన్లకు విస్తరిస్తారు. ఈ ప్రత్యేక మార్గాల ఏర్పాటుతో రైల్వే స్టేషన్లలో టికెట్లు తనిఖీ చేసే సిబ్బందిపై ఒత్తిడి తగ్గనుంది. అలాగే టికెట్ లేకుండా రైల్లో ప్రయాణించడాన్ని పూర్తిగా అరికట్టనున్నారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు