ఆస్కార్ అకాడమీ సభ్యురాలిగా ప్రియాంక
ఆస్కార్ అకాడమీ సభ్యురాలిగా ప్రియాంక
లాస్ఏంజిల్స్: మాజీ ప్రపంచ సుందరీ, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(ఆస్కార్స్) అకాడమీలో ప్రియాంక సభ్యురాలిగా ఎంపికైంది. తాజాగా అకాడమీ 57 దేశాలకు చెందిన 774 మందిని సభ్యత్వం కోసం ఆహ్వానించిన విషయం తెలిసిందే.
ఇక ఇండియా నుంచి ప్రియాంకకు ఈ అరుదైన అవకాశం దక్కడం విశేషం. ఇప్పటికే హాలీవుడ్ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక ప్రస్తుతం క్వాంటికో అమెరికా టీవీ సీరియల్‌లో నటిస్తోంది. కాగా, తనకు ఆస్కార్స్‌కు నామినేట్ అయిన చిత్రాలకు అవార్డులను ఎంపిక చేసే సభ్యుల అకాడమీలో అవకాశం రావడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొంది.

Comments
Post a Comment