కోచ్ పదవికి దరఖాస్తు
ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం భారత కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐ కోచ్ పదవి కోసం మరిన్ని దరఖాస్తులు ఆహ్వానించింది.
ఇప్పటికే కోచ్ రేసులో రవిశాస్త్రి, సెహ్వాగ్, టామ్మూడీ, దొడ్డా గణేశ్, లాల్చంద్ రాజ్పుత్ ఉన్నారు. తాజాగా విండీస్ మాజీ ఆటగాడు పిల్ సిమన్స్ భారత ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఐర్లాండ్ జట్టుకి ఎనిమిదేళ్లపాటు సిమన్స్ కోచ్గా సేవలందించాడు. 2011, 15 ప్రపంచకప్ల్లో ఐర్లాండ్... ఇంగ్లాండ్, వెస్టిండీస్, జింబాబ్వేపై విజయాలు సాధించింది. ఆ తర్వాత 2016లో వెస్టిండీస్ జట్టు.. సిమన్స్ కోచ్గా ఉన్న సమయంలోనే టీ20 ప్రపంచకప్ అందుకుంది. కోచ్గా సిమన్స్కు మంచి అనుభవం ఉందని, ఆటగాళ్లను పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తాడని, మంచి జట్టుని తయారు చేస్తాడని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మాజీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ మిచెల్ తెలిపారు.
కోచ్ పదవికి దరఖాస్తు చేసిన వారి కోసం బీసీసీఐ జులై 9 వరకు గడువు పెట్టింది. దరఖాస్తుదారులందరికీ గంగూలీ, లక్ష్మణ్, సచిన్ నేతృత్వంలోని క్రికెట్ సలహా మండలి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. జులై 10న కొత్త కోచ్ను ప్రకటిస్తామని తాజాగా గంగూలీ వెల్లడించాడు.

Comments
Post a Comment