షేక్‌పేట్‌లో డక్కన్ పార్క్‌ను కేటీఆర్ ప్రారంభించారు.

హైదరాబాద్: డక్కన్‌ పార్క్‌ను హరితహారానికి అనుసంధానం చేస్తామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. షేక్‌పేట్‌లో డక్కన్ పార్క్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఎమ్మెల్యే గోపీనాథ్‌ వినతి మేరకు పార్క్‌లో వాకింగ్‌ చేసుకునేందుకు స్థానికులకు అనుమతించారు. డక్కన్‌ పార్క్‌ చాలా ఏళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదని, అన్ని అవరోధాలను అధిగమించి పార్క్‌ను ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. అహ్మదాబాద్‌ తరహాలో హైదరాబాద్‌ను కూడా యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ నగరంగా గుర్తించేందుకు ప్రయత్నిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతిపాదనలు పంపిస్తామని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌ సేఫ్‌ సిటీ, నగరానికి పర్యాటకులు పెరుగుతున్నారని కేటీఆర్‌ తెలిపారు.
ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి దత్తాత్రేయ, మహమూద్ అలీ, అసదుద్దీన్ ఒవైసీ హాజరైనారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు