ఇజ్రాయెల్‌లో ట్రంప్, పోప్‌లకి మాత్రమే దక్కిన రెడ్ కార్పెట్ స్వాగతం..ఇప్పుడు మోదీకి

ఇజ్రాయిల్ లో మోడీకి రెడ్ కార్పెట్ స్వాగతం


పరిపాలనలో తనదైన మార్క్ చూపించుకునేందుకు ప్రయత్నిస్తోన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ యాత్రల విషయంలోనూ తనదైన ముద్ర వేసేందుకు అంతే ప్రయత్నిస్తున్నారు. ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్తున్న తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కనుండటమే అందుకు నిదర్శనం. ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంలో ల్యాండ్ అవనున్న భారత ప్రధానిని రిసీవ్ చేసుకునేందుకు స్వయంగా ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఎయిర్ పోర్టుకి రానున్నారు.నెతన్యాహుతోపాటు వివిధ వర్గాల మత పెద్దలు కూడా మోదీకి స్వాగతం పలికేందుకు ఎయిర్ పోర్టుకి చేరుకోనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి ఏమాత్రం తీసిపోకుండా భారత ప్రధానికి మర్యాదలు చేసేందుకు ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహు అన్నివిధాల ఏర్పాట్లు చేసిపెట్టారు.మోదీ ఇజ్రాయెల్‌లో వుండనున్న ఈ మూడు రోజులపాటు నెతన్యాహు కూడా మోదీ వెంటే వుండనున్నారు. కేవలం అక్కడి ప్రతిపక్ష నేతతో జరిగే సమావేశం తప్పితే మిగతా ప్రతీచోటా నెతన్యాహు మోదీ వెన్నంటే వుండనున్నారని తెలుస్తోంది. ఇక మోదీకి ఏర్పాటు చేసిన బస విషయంలోనూ నెతన్యాహు ఏ మాత్రం రాజీపడలేదు. డొనాల్డ్ ట్రంప్‌కి బస ఏర్పాటు చేసిన కింగ్ డేవిడ్ హోటల్ సూట్‌లోనే మోదీకి ఏర్పాట్లు సిద్ధంగా వున్నాయి. ఇప్పటివరకు ఇజ్రాయెల్‌లో ట్రంప్, పోప్‌లకి మాత్రమే దక్కిన రెడ్ కార్పెట్ స్వాగతం మోదీకి దక్కనుండటం ప్రస్తుతం అంతర్జాతీయంగానూ చర్చనియాంశమైంది. 

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు