టీమిండియా కొత్త కోచ్‌గా రవిశాస్త్రి

టీమిండియా కొత్త కోచ్‌గా రవిశాస్త్రి


ముంబయి : టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ఎంపికయ్యారు. అనిల్ కుంబ్లే స్థానంలో రవిశాస్త్రి కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. కోచ్ ఎంపిక కోసం సోమవారం ఐదుగురికి గంగూలీ, లక్ష్మణ్, సచిన్‌లతో కూడిన సిఎసి ఇంటర్వూలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోచ్ పేరును ప్రకటించకుండా వాయిదా వేసింది. టీమిండియా కెప్టెన్ కోహ్లీతో మాట్లాడిన అనంతరమే నిర్ణయం తీసుకుంటామని గంగూలీ చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా బిసిసిఐ పాలకుల కమిటి చైర్మ న్ వినోద్ రాయ్ కోచ్ ప్రకటనను వాయిదా వేయడాన్ని తప్పుబట్టారు. ఈ క్రమంలో కొత్త కోచ్‌గా రవిశాస్త్రిని ఎంపిక చేసినట్టు సిఎసి ఈరోజు వెల్లడించింది.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు