తెలుగు మహిళకు దక్కిన ఉన్నత పదవి
అమెజాన్ డైరెక్టర్‌గా షాలిని
తెలుగు మహిళకు దక్కిన ఉన్నత పదవి
ప్రపంచ ప్రఖ్యాత సంస్థ అమెజాన్‌లో తెలుగు మహిళ కీలక పదవిని చేపట్టారు. పుచ్చలపల్లి షాలిని అమెజాన్‌బిజినె్‌స.కామ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. గత ఏడాది అమెజాన్‌లో చేరిన ఆమె.. భారత్‌లో ఆ సంస్థ వ్యాపార విస్తరణలో డైరెక్టర్‌గా ముఖ్య భూమిక పోషించనున్నారు. కడపలో పుట్టి పెరిగిన షాలిని.. ప్రపంచ స్థాయి ప్రభావశీల మహిళల్లో ఒకరు. అమెజాన్‌లోకి రాకముందు మరో ప్రఖ్యాత సంసంస్థ పెప్సికో లెహర్ ఫుడ్స్ బిజినెస్ సీఈవోగా.. దానికి ముందు ఇన్‌బెవ్, గోద్రెజ్ సంస్థల్లో పని చేశారు. కడప విద్యామందిర్‌లో చదువుకున్న ఆమె మద్రాసు ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. గ్జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో పర్సనల్ మేనేజ్‌మెంట్, ఇన్‌సీడ్‌లో ఎంబీఏ చదివారు. 2014లో ఎకనామిక్ టైమ్స్, స్పెన్సర్ స్టువర్ట్ వెలువరించిన 40 మంది ప్రభావశీల మహిళల జాబితాలో షాలిని కూడా ఉన్నారు. 2015లో ప్రపంచ ఎకనామిక్ ఫోరం ఆమెను యంగ్ గ్లోబల్ లీడర్‌గా గుర్తించి గౌరవించింది.

Comments
Post a Comment