మనీ ట్రాన్స్‌ఫర్‌ ఛార్జీలు తగ్గించిన ఎస్‌బీఐ

మనీ ట్రాన్స్‌ఫర్‌ ఛార్జీలు తగ్గించిన ఎస్‌బీఐ

దిల్లీ: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ ఎస్‌బీఐ ఆన్‌లైన్‌లో నగదు బదిలీ సేవలపై ఛార్జీలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌ (ఎన్‌ఈఎఫ్‌టీ), రియల్‌ టైం గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ (ఆర్టీజీఎస్‌) ఛార్జీలను 75శాతం తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. తగ్గించిన ఈ రుసుములు జులై 15 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. తగ్గించిన ఈ ఛార్జీలు ఇంటర్నెట్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ ద్వారా లావాదేవీలు జరిపిన వారికి మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది.
జీఎస్టీ అమలు నేపథ్యంలో ఆన్‌లైన్‌ ద్వారా నగదు బదిలీ చేసే ఖాతాదారులపై ఇటీవలే ఎస్‌బీఐ ఛార్జీల భారం మోపుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
దీని ప్రకారం.. ఐఎంపీఎస్‌ ద్వారా రూ.1000 వరకు నగదు బదిలీపై ఎలాంటి ఛార్జీలు ఉండబోవని బ్యాంకు యాజమాన్యం స్పష్టం చేసింది. అలాగే రూ. 1001 నుంచి 1,00,000 లోపు నగదు బదిలీలపై జీఎస్టీ కింద రూ.5లు, 1,00,001 నుంచి రూ.2,00,000 వరకు రూ.15లు వసూలు చేస్తున్నట్టు ఎస్‌బీఐ వెల్లడించింది. అయితే, గురువారం ఆన్‌లైన్‌ చెల్లింపులపై 75శాతం ఛార్జీలు తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకోవడం విశేషం.
సవరించిన రేట్ల ప్రకారం..
ఎన్‌ఈఎఫ్‌టీ లావాదేవీలకు రూ.10 వేల వరకు రూ. 2లకు బదులుగా ఇకపై రూ.1 వసూలు చేయనున్నారు. రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు ట్రాన్స్‌ఫర్‌పై ప్రస్తుం రూ.4కు బదులుగా రూ.2లు వసూలు చేయనున్నారు. రూ. లక్ష నుంచి రూ.2లక్షల మధ్య రూ.12లకు బదులుగా ఇకపై రూ.3లు మాత్రమే ఛార్జి పడనుంది.

ఆర్‌టీజీఎస్‌ లావాదేవీలకు రూ.2లక్షల నుంచి 5లక్షల వరకు రూ. 20కు బదులుగా రూ.2 వసూలు చేస్తారు. అలాగే రూ. 5లక్షలకు పైబడిన లావాదేవీలకు రూ.40కు బదులు రూ.10లు మాత్రమే వసూలు చేయనున్నారు.
2017 మార్చి 31నాటికి ఎస్‌బీఐకి 3.27 కోట్ల మంది ఇంటర్నెంట్‌ బ్యాంకింగ్‌ వినియోగదారులు ఉన్నారు. అంతేకాకుండా మరో 2కోట్ల మంది మొబైల్‌ బ్యాంకింగ్‌ కస్టమర్లు ఉన్నారు. ఇంకా పెద్దమొత్తంలో కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ సరికొత్త నిర్ణయం తోడ్పడుతుందని బ్యాంకు అధికారులు భావిస్తున్నారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు