కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం కుమారుడు కార్తి చిదంబరానికి సుప్రీంకోర్టులో మంగళవారం నిరాశ

కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం కుమారుడు కార్తి చిదంబరానికి సుప్రీంకోర్టులో మంగళవారం నిరాశ ఎదురైంది. ఆయనపై మనీలాండరింగ్ నిరోధక చట్టం క్రింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన కేసులో ముందస్తు విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.
కార్తి చిదంబరం వాదనను వినేందుకు మద్రాస్ హైకోర్టుకు అధికార పరిథి ఉందా? అని ఈడీ సుప్రీంకోర్టును అడిగింది. ఈడీ సమన్లను కార్తి మద్రాస్ హైకోర్టులో సవాలు చేశారు. గత నెలలో చెన్నైలోని కార్తి నివాసంపై ఆదాయపు పన్ను శాఖ దాడుల నేపథ్యంలో కార్తి, తదితరులపై ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ కేసు దాఖలు చేసింది.
పి. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో మారిషస్ నుంచి నిధులను స్వీకరించినందుకు కార్తి చిదంబరంపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇంద్రాణి, పీటర్ ముఖర్జియా యాజమాన్యంలోని ఐఎన్ఎక్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌ మీడియా గ్రూప్‌కు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి అనుమతులకు సంబంధించి ఈ కేసు నమోదైంది. నిందితులు నేరపూరిత అవినీతి, మోసం, కుట్రలకు పాల్పడినట్లు సీబీఐ ఆరోపించింది.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు