ఈ పాపకు జీఎస్టీ అని నామకారణం చేశారు

దేశంలో ఎవరినోట విన్నా జీఎస్టీ గురించే వినిపిస్తోంది. దేశాన్ని ఆర్థికంగా మరో మలుపు తిప్పుతుందని ఆశిస్తూ కేంద్రం తీసుకువచ్చిన ఈ జీఎస్టీపై దేశవ్యాప్తంగా విస్తృతస్థాయిలో చర్చ జరుగుతోంది. ఇదిలావుంటే, జీఎస్టీ అమలైన శుక్రవారం రాత్రి జన్మించిన కొంతమంది శిశువులకి తల్లిదండ్రులు జీఎస్టీ అనే నామకరణం చేశారనే వార్త ప్రస్తుతం ఆసక్తిరేపుతోంది. రాజస్థాన్‌లోని పాలి జిల్లా కేంద్రానికి చెందిన జస్‌రాజ్ భార్యకి శుక్రవారం రాత్రే ప్రసవవేదనతో నొప్పులు రావడంతో ఆమెని బాంగడ్ ఆస్పత్రిలో చేర్పించారు. అదే రోజు రాత్రి సరిగ్గా 12 గంటలకి పార్లమెంట్‌లో జీఎస్టీ బిల్లు అమలైన సందర్భంలోనే ఇక్కడ ఆస్పత్రిలో జస్‌రాజ్ భార్య పండంటి కవల పిల్లలకి జన్మనిచ్చింది. వారిలో ఒకరు మగ శిశువు కాగా మరొకరు ఆడపిల్ల. వీరిలో ఆడ పిల్లకి జీఎస్టీ అని నామకారణం చేశారు జస్‌రాజ్ దంపతులు. అక్కడున్న ఆస్పత్రి సిబ్బంది కూడా ఆ శిశువుని జీఎస్టీ అనే పిలవడం మొదలుపెట్టారు. అప్పుడే పుట్టిన కవలలని చూడటానికి వచ్చిన బంధువులు, సన్నిహితమిత్రులు సైతం పాపని జీఎస్టీ అనే పేరుతోనే పిలవడానికి ఆసక్తి కనబర్చారు.తమకి పుట్టిన పాపకి జీఎస్టీ అని పేరు పెట్టడంపై స్పందించిన జస్‌రాజ్… ” ప్రస్తుతానికి ఆస్పత్రిలో అందరూ అలా జీఎస్టీ అని పిలవడం జరిగింది కానీ ఆతర్వాత జన్మ నక్షత్రాన్నిబట్టి మరో పేరు మార్చుతాం” అని తెలిపారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు