జవాన్ల బలిదానాల ముందు తాను చేసే సాయం చాలా చిన్నది.

ఈ యేడాది ఏప్రిల్‌లో చత్తీస్ గఢ్‌లోని సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై మావోలు దాడి చేయగా, అందులో 25 మంది జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరులైన జవాన్ల కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు రాగా, తాజాగా హీరో వివేక్‌ ఒబెరాయ్‌ కూడా తనవంతు సహాయం చేసేందుకు ముందుకొచ్చాడు. అమరజవాన్ల కుటుంబసభ్యులకు ఫ్లాట్లు నిర్మించనున్నాడు ఈ హీరో. దీంతో పలువురు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.., “సీఆర్పీఎఫ్ జవాన్ల బలిదానాల ముందు తాను చేసే సాయం చాలా చిన్నదని అన్నాడు. దేశ ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు ప్రాణత్యాగం చేస్తున్న జవాన్లను స్మరిస్తూ నివాళిగా వారి కుటుంబాలకు ఈ ఫ్లాట్లను ఇస్తున్నానని తెలిపాడు. జవాన్ల కుటుంబాలకు అండగా నిలిచి, వారిని గౌరవించేందుకు తనకు తోచిన మార్గం ఇదని” పేర్కొన్నాడు. అలాగే “నక్సల్ ప్రభావిత ప్రాంతాలతో పాటు కార్గిల్, సియాచిన్ వంటి చోట్ల విధులు నిర్వర్తించడం సాధారణ విషయం కాదని, ఎన్నో ఒత్తిళ్లను తట్టుకుని నిలబడాల్సి ఉంటుందని, అంత కష్టమైన పరిస్థితుల్లో కూడా సమర్థవంతంగా విధులు నిర్వర్తించడం వారికే చెల్లిందని” చెప్పాడు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు