యువతి కుటుంబ సభ్యులతో కలిసి ప్రియుడి ఇంటి ఎదుట ధర్నా
మిర్యాలగూడ అర్బన్ : ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి మోసం చేసిన ప్రియుడితో వివాహం జరిపించి న్యాయం చేయాలంటూ యువతి మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి ప్రియుడి ఇంటి ఎదుట ధర్నా చేపట్టింది. పట్టణంలోని తాళ్లగడ్డకు చెందిన గాజుల అనూష, గాంధీనగర్‌కు చెందిన మంద మహేష్‌లు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కొద్దినెలల క్రితం వీరిరువురి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు.
తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని డబ్బులు తీసుకొని మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ కొద్దినెలల క్రితం జిల్లా ఎస్పీ, డీఎస్పీ, వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీస్ అధికారులు మహేష్‌పై కేసు నమోదు చేశారు. ఆ కేసు కోర్డు విచారణలో ఉండగానే మరో యువతితో మహేష్ వివాహం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న విషయాన్ని తెలుసుకున్న అనూష ఆందోళకు దిగింది. ఇరువర్గాల పెద్దల సమక్షంలో సమస్యను పరిష్కరించుకుందామని యువకుడి తండ్రి నచ్చజెప్పడంతో యువతి తన ఆందోళన విరమించుకున్నట్లు స్థానికులు తెలిపారు.

Comments
Post a Comment