రామ్‌నాథ్ కోవింద్‌కు సంపూర్ణ మద్దతు: కెసిఆర్

హైదరాబాద్: ఎన్‌డిఎ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ నగరంలోని జలవిహార్‌లో టిఆర్‌ఎస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ… రామ్‌నాథ్ కోవింద్‌కు ఘన స్వాగతం పలుకడం ఆనందంగా ఉందన్నారు. ఎన్నో ఏళ్ల పోరాటం తరువాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నం. రాష్ట్రం ఏర్పడే నాటికి చాలా సమస్యలున్నాయి. తీవ్రమైన కరెంటు సంక్షోభం నుంచి అతి తక్కువ సమయంలో బయటపడ్డాం. అతి తక్కువ రోజుల్లోనే విద్యుత్ మిగులు రాష్ట్రంగా నిలవబోతున్నం.
జిఎస్‌డిపి వృద్ధి రేటులో దేశంలోనే అగ్రగామిగా ఉన్నాం. వృద్ధులు, వికలాంగులకు నెలనెలా ఆసరా పెన్షన్ ఇచ్చి ఆదుకుంటున్నమని చెప్పారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నమన్నారు. ఎస్‌సి, ఎస్‌టి ప్లాన్ నిధులను సమర్థవంతంగా ఖర్చుచేసేందుకు చట్టం తెచ్చామన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చిన్నట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్‌కు మా సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.

Comments
Post a Comment