శ్రేష్ఠా ఠాకూర్‌కు హ్యాట్యాప్

శ్రేష్ఠా ఠాకూర్ గుర్తుందిగా… అదేనండి ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో బీజేపీ నేతకు ఘాటైన సమాధానాలిస్తూ సోషల్ మీడియాలో లేడీ సింగంగా కీర్తించిన బడిన పోలీసు అధికారిణి. మరి అధికార పార్టీ నేతలతో పెట్టుకుంటే ఉంటుందా… పోలీసు అధికారుల బదిలీల్లో భాగంగా ఆమెపై బదిలీవేటు వేసింది … ఆమె స్యానా సర్కిల్‌ నుండి విధులు నిర్వహిస్తుండగా బహ్రైచ్‌కి బదీలీ చేశారు.
ప్రస్తుతం బహ్రైచ్‌లో విధుల్లో చేరిపోయిన శ్రేష్ఠా ఠాకూర్… సోషల్ మీడియాలో తనను సపోర్టు చేసిన వారిని ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టారు. త‌న‌ను నేపాల్‌ సరిహద్దులోని బహ్రైచ్‌కి బదిలీ చేశారు… త‌న గురించి ఎవ్వరూ బాధపడకూడదు… తాను సంతోషంగానే ఉన్నాన‌ని పోస్ట్ చేసిన శ్రేష్ఠా ఠాకూర్… తాను చేస్తున్న మంచి పనికి ఇదో రివార్డ్‌గా భావిస్తానని పేర్కొన్నారు. దీపం ఎక్కడుంటే అక్కడ వెలుగు నిండుతుందని… దీపానికి సొంత ఇల్లు అంటూ ఉండదని ఆమె పోస్ట్ చేశారు… ఓవైపు శ్రేష్ఠా ఠాకూర్‌కు హ్యాట్యాప్ అంటూనే మరోవైపు యోగీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు నెటిజ‌న్లు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు