ఐఐటీ ప్రవేశాలపై స్టే ఎత్తివేత : సుప్రీం
ఐఐటీ ప్రవేశాలపై స్టే ఎత్తివేత : సుప్రీం
ఢిల్లీ: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాల ప్రక్రియపై ఉన్న స్టేను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. కౌన్సెలింగ్, ప్రవేశాల్లో జోక్యం చేసుకోరాదని హైకోర్టులకు సర్వోన్నత న్యాయస్థానం సూచనలు చేసింది.
ఈ ఏడాది జరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో ఏడు ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు ఆన్సర్ కీలో గల్లంతయ్యాయి. దీంతో అందరికీ సమానంగా మార్కులు కలిపి మెరిట్ లిస్ట్‌ను విడుదల చేసింది ఐఐటీ జాయింట్ అడ్మిషన్ బోర్టు. అయితే దీన్ని సవాలు చేస్తూ.. ఐశ్వర్య అగర్వాల్ అనే విద్యార్థిని పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై గత శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ప్రవేశ ప్రక్రియపై స్టే విధించి.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అయితే తప్పుడు ప్రశ్నలకు మార్కులు తొలగించి మళ్లీ మెరిట్ లిస్ట్‌ను తయారుచేయడం సాధ్యం కాదని ఐఐటీ బోర్డు సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో నేడు మరోసారి విచారణ చేపట్టిన న్యాయస్థానం స్టేను ఎత్తివేసింది.

Comments
Post a Comment