నిజాయితీ కలిగిన పోలిస్ అధికారికి అరుదైన గౌరవం 'బదిలీ'

లఖ్నవూ: ఇటీవల స్థానిక భాజపా నేతల తీరుకి దీటుగా సమాధానం చెప్పి వారిని జైలుకు పంపి అందరి దృష్టిని ఆకర్షించిన ఉత్తర్ప్రదేశ్ పోలీసు అధికారిణి శ్రేష్ఠా ఠాకూర్ బదిలీ అయ్యారు. బులంద్షెహర్లోని స్యానా సర్కిల్లో విధులు నిర్వహిస్తున్న ఆమెని  బదిలీ చేశారు.
ఇటీవల స్థానిక భాజపా నేతలు డ్రైవింగ్ లైసెన్స్లు లేకుండా పట్టుబడడంతో వారికి జరిమానా విధించారు. దాంతో నేతలు ఆందోళనకు దిగారు. అప్పుడు శ్రేష్ఠా వారికి దీటుగా సమాధానం చెప్పి ఆందోళన చేసినవారిలో ఐదుగురిని జైలుకు పంపింది. ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవడంతో అందరూ ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు