నవాబ్ జంగ్ సేవలు మరిచిపోలేనివి : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : ప్రఖ్యాత ఇంజినీర్ నవాబ్ జంగ్ జయంతి సందర్భంగా ఆయన సేవలను ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. నవాబ్‌జంగ్ సేవలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని సీఎం పేర్కొన్నారు. నవాబ్‌జంగ్ జయంతి రోజును ఇంజినీర్ల దినోత్సవంగా నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు సీఎం.
మీర్ అలీ నవాబ్ జంగ్ పేరు వింటే హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడాలు పులకించిపోతాయి. హైదరాబాద్ రాష్ట్రంలోని నిజాం ప్రభుత్వంలో చీఫ్ ఇంజినీర్‌గా పనిచేసిన నవా బ్ జంగ్ ఎన్నో చారిత్రక కట్టడాలకు మార్గదర్శకుడు. హైదరాబాద్‌లోని పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులు, బిల్డింగులు, బ్రిడ్జీలు ఆయన మార్గదర్శకత్వంలో రూపందాల్చాయి.
ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్ లాంటి చెరువులతో పాటు నిజామాబాద్‌లో ఉన్న అలీ సాగర్ రిజర్వాయర్ లాంటి ప్రాజెక్టులకు మీర్ అలీ నవాబ్ జంగ్ రూపమిచ్చారు. ఈ సమయంలో గోదావరి, మంజీరా నదులపై నిర్మించిన ప్రాజెక్టులు, అలాగే ఇతర భవన నిర్మాణాలు ఆయన మార్గదర్శకత్వం లో పురుడుపోసుకున్నాయి. ఖమ్మంలోని వైరా, పాలేరు బ్రిడ్జీలు కూడా ఈయన హాయాంలో జరిగినవే. హైదరాబాద్‌లోని ఫతేనగర్ బ్రిడ్జీ నిర్మాణం కూడా నవాబ్ జంగ్ డిజైన్ చేసిందే.
కృష్ణా, తుంగభద్ర నీటి మళ్ళింపు ఆలోచన కూడా నవాబ్ జంగ్‌దే. మద్రాస్, హైదరాబాద్ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం ఇది. ఢిల్లీలో ఉన్న హైదరాబాద్ భవనాన్ని కూడా నవాబ్ జంగ్ స్వయంగా డిజైన్ చేశారు. ఇలా ఒక్కటేంటి హైదరాబాద్‌లో ఉన్న అసెంబ్లీ భవనం, హైకోర్టు బిల్డింగ్, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఆర్ట్స్ కాలేజీ బిల్డింగ్, సెంట్రల్ లైబ్రరీలాంటి చారిత్రక కట్టడాలకు మూలకారణం మీర్ అలీ నవాబ్ జంగ్.
హైదరాబాద్ రాష్ట్రంలో జన్మించిన నవాబ్ జంగ్ నిజాం కాలేజీలో విద్యాభ్యాసం పూర్తిచేశారు. జాతీయ ప్లానింగ్ కమిటీ ద్వారా నదులపై శిక్షణ పొందిన నవాబ్ జంగ్ ఇరిగేషన్ చైర్మన్‌గా కూడా పనిచేశారు. ఆయన ప్రతిభ ను గుర్తించిన అప్పటి ప్రభుత్వం 1896 సంవత్సరం లో ఇంగ్లండ్‌లోని కూపర్ హిల్ ఇంజినీరింగ్ కళాశాలకు పంపించింది. 1899లో హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ఆయన 1913వ సంవత్సరంలో పబ్లిక్‌వర్క్స్ విభాగంలో సహాయ ఇంజినీరుగా విధుల్లో చేరారు. అనంతరం పీడబ్ల్యూడీ, టెలిఫోన్ విభాగాలకు సెక్రటరీగా నియమితులయ్యారు.
తన ప్రతిభను గుర్తించిన అప్పటి ప్రభుత్వం 1918లో చీఫ్ ఇంజినీర్‌గా, 1929లో సెక్రటరీగానూ నియమించిం ది. సక్కూర్ బ్యారేజీ నిర్మాణం సందర్భంగా ముంబయి ప్రభుత్వం తమతో కలిసి పనిచేయాలని నవాబ్ జంగ్‌ను ఆహ్వానించిందంటే ఆయన ప్రతిభను ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వ్యక్తి మరణించినా అతని జ్ఞాపకాలు సమాజానికి చిరకాలం గుర్తుచేస్తుంటాయనేది మీర్ అలీ నవాబ్ జంగ్ నిరూపించారు.

Comments
Post a Comment