హ్యాపీ బర్త్ డే కీరవాణి
కీరవాణి అందించిన సంగీతం వింటున్నప్పుడు అలనాటి వాగ్గేయకారులు గుర్తుకొస్తారు. మనకు దేశీయ సంగీతపు జావళీలను అందిస్తున్న కీరవాణి పాటలు వింటుంటే ఏదో తెలియని మధురానుభూతి కలుగుతుంది. కీరవాణి ఆ మధురానుభూతిని తెలుగు సినిమాలకే పరిమితం చేయలేదు. తమిళం, కన్నడం, మలయాళం, హిందీ చిత్రాలకు కూడా ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రమేంటంటే తమిళంలో ఆయనను మరగత మణి అని, బాలీవుడ్ లో ఎం ఎం క్రీం అని అంటారు.
1990లో మనసు మమత సినిమాకు సంగీతాన్ని అందించడం ద్వారా టాలీవుడ్ కి వచ్చిన కీరవాణి అనేక తరహా చిత్రాలకు మ్యూజిక్ సమకూర్చారు. కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్, సస్పెన్స్ క్రైం, థ్రిల్లర్స్, ప్రేమ, విప్లవం, భక్తి , హాస్యరస చిత్రాలకు సంగీతం సమకూర్చారు. ఇందుకు ఎగ్జాంపుల్ గా సీతారామయ్యగారి మనవరాలు, క్షణక్షణం, పీపుల్స్ ఎన్ కౌంటర్, మొండిమొగుడు పెంకి పెళ్లాం, ఘరానా మొగుడు వంటి సినిమాల్ని చెప్పుకోవచ్చు. అలాగే అల్లరి ప్రియుడు, ఆపద్బాంధవుడు, అన్నమయ్య, శుభ సంకల్పం, అరుంధతి, శ్రీరామదాసు, ఈగ వంటి సినిమాలూ ఉన్నాయి..
ఎన్నో సినిమాలకు ఉత్తమ సంగీతాన్ని అందించిన కీరవాణి అవార్డుల పంట పండించారు. ఉత్తమ సంగీత దర్వకుడిగా ఆయన జాతీయ అవార్డును పొందారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎనిమిదిసార్లు నంది అవార్డులు, నాలుగుసార్లు ఫిలింఫేర్ అవార్డులు, తమిళనాడు రాష్ట్ర ఫిలిం అవార్డును కూడా అందుకొన్నారు. ఆమధ్య ఈగ వంటి ప్రయోగాత్మక సినిమాకు సంగీతం అందించిన కీరవాణి .. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన బాహుబలికి కూడా సంగీతాన్ని సమకూర్చారు.
కీరవాణి సంగీత దర్శకుడు మాత్రమే కాదు, రాగాలు కట్టే ఈయన వాటిని తన గొంతులో పలికించగలరు. ఆయన గొంతులో భక్తి భావం తొణికిసలాడుతుంది. భక్తిరసాన్వితమైన ఎన్నో గీతాల్ని కీరవాణి సినిమాలకోసం పాడారు.

Comments
Post a Comment