ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి



ఓటరు జాబితాలో 18యేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ విధిగా నమోదు చేయించుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పంచాయతీ అధికారి, సంక్షేమ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఆయా కళాశాలల ప్రతినిధులతో డీఆర్‌వో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 18సంవత్సరాల వయస్సు నిండిన వారు ఎవరు కూడా ఓటరు జాబితాలో నమోదు కాకుండా ఉండకూడదని, అర్హులైన వారందరినీ ఓటరు జాబితాలో చేర్చేందుకు ఈ నెల 14,15,18,19 తేదీలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జనాభాలో అధికశాతం ఉన్న 18నుంచి 21సంవత్సరాల వయస్సు గల వారు ఓటరు జాబితాలో లేకపోవడం ఎన్నికల కమిషన్ దృష్టికి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో 18నుంచి 21సంవత్సరాల యువత కోసం ప్రత్యేకంగా వారంద రూ ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకునేందుకు ఈ ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. గ్రామ పంచాయతీలు, కళాశాలలు, వసతి గృహాలలో 2017 జనవరి 1నాటికి 18సంవత్సరాలు నిండిన వారందరినీ ఓటరు జాబితాలో చేర్చేందుకు చర్య లు చేపట్టాలన్నారు.
ముఖ్యంగా ఓటరు ప్రక్రియ జరిగే చోట విద్యార్థులు అందుబాటులో లేకపోవడం వల్ల నమోదు చేయించుకోలేకపోతున్నారని వివరించారు. డిగ్రీ, వైద్య, ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు సంబంధించి ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ ఓటరుగా నమోదు అయ్యారా లేదా అనే వివరాలను విద్యార్థుల నుంచి సేకరించి వారి స్వస్థలంలో నమోదుకాని పక్షంలో ప్రస్తుతం నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలలో విద్యార్థులను, జిల్లాలోని అర్హులైన విద్యా హంగులను ఓటరు జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి ఇంటింటికి వెళ్లి ఓటరు జాబితాలో నమోదు కాని యువతను గుర్తించి విధిగా నమోదు చేయించాలన్నారు. నర్ణీత ప్రొఫార్మాలో ఓటరు జాబితాలో చేర్చడం, తొలగించడం, సవరించడం ఒక పోలింగ్ స్టేషన్ నుంచి మరొక పోలింగ్ స్టేషన్‌కు మార్పు చేసిన జాబితాలు సంబంధిత ఎంపీడీవోలు, గ్రామ సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు జిల్లా పంచాయతీ అధికారికి సమర్పించాలన్నారు. ఓటరు నమోదు కోసం అవసరమైన ఫారం-6ను తహసీల్దార్ నుంచి తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఆయా శాఖల అధికారులు మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు