అధిష్టానం అనుమతి ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తా: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలను కులాల వారిగా విడదీసి టీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నల్గొండలో ఉదయ సముద్రంకు నీళ్లు ఇవ్వక పోతే మళ్ళీ ఫ్లోరైడ్ నీళ్లు తాగే పరిస్థితని, కృష్ణా బోర్డు కూడా ఒప్పించలేని అసమర్థుడు కేసీఆర్ అని, ఇంత చెత్త పాలన ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ ప్రజలకు ఎం చెప్పాలో కూడా తెలియడం లేదని అన్నారు. నల్గొండ జిల్లాకు మంత్రి ఉన్నా లేనట్లేనని, ఏ ఒక్క ప్రజాసమస్యను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు
రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిశానని, రాష్ట్రంలో ప్రజాసమస్యలపై పాదయాత్ర చేస్తానని అధిష్టానం అనుమతి కోరినట్లు ఆయన చెప్పారు. అధిష్టానం అనుమతి ఇస్తే కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని, సామాన్యకార్యకర్తగానే జనంలోకి వెళ్తానని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

Comments
Post a Comment