గత నాలుగురోజులుగా తమిళనాడులో జరుగుతున్న థియేటర్ల బంద్‌కు తెరపడింది.
జీఎస్టీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుండి వినోదపు పన్నును అధికంగా వేయడంతో గత నాలుగురోజులుగా తమిళనాడులో జరుగుతున్న థియేటర్ల బంద్‌కు తెరపడింది. ఇవాళ ఉదయం నుండి అక్కడ థియేటర్లు తెరుచుకున్నాయి. టాక్స్‌లపై పూర్తిస్థాయిలో పరిష్కారం లభించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం విధించిన వినోదపు పన్ను నుండి మినహాయింపు రావడంతో తాత్కాలికంగా థియేటర్ల యజమానులకు ఉపశమనం లభించింది.
దీంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వస్తుసేవల పన్ను (జీఎస్టీ)తో మాత్రమే ప్రస్తుతానికి టికెట్లను విక్రయించనున్నారు. ఇందులో భాగంగా రూ.120లు ఉండే టికెట్‌పై 28% జీఎస్టీ పడనుండగా, రూ.100 రూపాయల కన్నా తక్కువ ఉండే టికెట్‌పై 18% జీఎస్టీ పడనుంది. ఇక మరోవైపు రాష్ట్ర సర్కారు వినోదపు పన్ను, టికెట్ల ధర ఖరారుకు సంబంధించి ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. వినోదపు పన్ను విషయమే కాకుండా, టికెట్ ధర ఎంత ఉండాలనే అంశంపైనా ఈ కమిటీ నివేదిక సమర్పించనున్నట్లు సమాచారం. ఇక మరోవైపు ఈ రోజు నుండి ‘వనమగన్’, గత శుక్రవారం విడుదలైన ‘ఇవన్ తందిరన్’ వంటి సినిమాలు థియేటర్లలో ప్రదర్శితమవుతాయి.

Comments
Post a Comment