వీరం.. వేదాళమ్ చిత్రాల తర్వాత శివ-అజిత్ కాంబినేషన్ లో వివేగం
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో అజిత్. ఈయన నుండి సినిమా వస్తుందంటే పెద్ద పండగా చేసుకుంటారు. వీరం.. వేదాళమ్ చిత్రాల తర్వాత శివ-అజిత్ కాంబినేషన్ లో వివేగం తో రాబోతున్నాడు. నిన్ననే ఈ చిత్ర షూటింగ్ అంత పూర్తి చేసుకుందట. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసే పనిలో చిత్ర యూనిట్ బిజీ కానున్నారట.
ఆగస్ట్ 10న చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకొస్తున్నామని ప్రకటించారు. కొద్ది రోజులుగా చిత్ర రిలీజ్ డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అభిమానులకు టీం ప్రకటన సంతోషం కలుగజేస్తుంది. కాజల్.. అజిత్ తో జత కట్టగా ఇందులో అక్షర హాసన్ మరియు వివేక్ ఒబెరాయ్ ముఖ్య పాత్రలు పోషించారు. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో అజిత్ ఇంటర్‌పోల్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడట. అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.

Comments
Post a Comment