శంకర్‌ నాయక్‌ వ్యవహారంపై స్పందించిన ఐఏఎస్‌ల బృందం

శంకర్‌ నాయక్‌ వ్యవహారంపై స్పందించిన ఐఏఎస్‌ల బృందం


హైదరాబాద్: మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రీతీ మీనా పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే బానోతు శంకర్‌ నాయక్‌ వ్యవహారంపై తెలంగాణ సీఎస్‌ ఎస్పీ సింగ్‌ను ఐఏఎస్‌ల బృందం కలిసింది. అత్యవసర జనరల్‌బాడీ సమావేశంలో చేసిన తీర్మానాల కాపీని సీఎస్‌కు ఐఏఎస్‌ల బృందం అందజేసింది. అనంతరం బీపీ ఆచార్య మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ప్రవర్తనను ఖండిస్తున్నామన్నారు. ఘటనపై ఐజీ స్థాయి మహిళా అధికారితో విచారణ జరిపించాలని తెలిపారు.
ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా ...ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలన్నారు. ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆ యంత్రాంగానికి ఫిర్యాదు చేసేలా ఉండాలి.. తప్పు చేశారు కాబట్టే చట్టపరంగా కేసు నమోదైందని బీపీ ఆచార్య స్పష్టం చేశారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు