పాలమూరులో సీసీఐ నూతన కార్యాలయం ప్రారంభం
పాలమూరులో సీసీఐ నూతన కార్యాలయం ప్రారంభం
మహబూబ్‌నగర్ :మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సీసీఐ నూతన కార్యాలయాన్ని మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. గతంలో పత్తి రైతులు, జిన్నింగ్ మిల్లు యజమానులు చెక్కుల క్లియరెన్స్ కోసం వరంగల్ జిల్లాకు వెళ్లాల్సి వచ్చేది.. ఇప్పుడు ఆ సమస్య తీరిందన్నారు. పత్తి కొనుగోలుకు 150 కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీసీఐ డైరెక్టర్‌ను కోరామని చెప్పారు. సీసీఐ తెచ్చేందుకు కృషి చేసిన ఎంపీ జితేందర్‌రెడ్డికి మంత్రి అభినందనలు తెలిపారు. దేశంలోనే మూడు సీసీఐ కేంద్రాలున్న మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని మంత్రి వెల్లడించారు.

Comments
Post a Comment