అంతకంతకు కసి తీర్చుకుంటాం : పార్థసారథి
అంతకంతకు కసి తీర్చుకుంటాం : పార్థసారథి
అమరావతి: గడిచిన మూడేళ్ల పరిపాలనలో చంద్రబాబు నాయుడు పెద్దగా చేసిందేమీ లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పార్థసారథి అన్నారు. కోట్లు సంపాధించడం, హత్యారాజకీయాలు చేయడం లక్ష్యంగానే చంద్రబాబు ముందుకెళుతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చివరి రోజు జాతీయ ప్లీనరీ సందర్భంగా పార్థసారథి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై దాడుల అంశంపై తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిని పార్టీ నేత నందమూరి లక్ష్మీపార్వతీ బలపరిచారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ చంద్రబాబు రాజధానిని సింగపూర్ రాబందులకు అప్పగించారని మండిపడ్డారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటారని చెప్పారు. సుపరిపాలన అందించి చంద్రబాబుపై అంతకంతకు కక్ష తీర్చుకొని తీరుతామని స్పష్టం చేశారు. ఇసుక దందాతో టీడీపీ నేతలు కోట్ల రూపాయల దందా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు రూ.5వేలు ఇస్తానని నంద్యాలలో బహిరంగంగా చెప్పిన చంద్రబాబుకు ఏమాత్రం నీతి, నిజాయితీ లేదన ధ్వజమెత్తారు. బాబుకు నిజంగా దమ్ముంటే పార్టీ మారిన వారితో రాజీనామా చేయించి మళ్లీ గెలవాలి అని సవాల్ విసిరారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కడం చంద్రబాబు జేజమ్మ తరం కాదన్నారు. ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అని స్పష్టం చేశారు.

Comments
Post a Comment