ముత్తూట్ ఫైనాన్స్ లో చోరీకి యత్నం..
ముత్తూట్ ఫైనాన్స్ లో చోరీకి యత్నం..
రంగారెడ్డి : దొంగలు మళ్లీ ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీని టార్గెట్ చేశారు. మరోసారి చోరీ చేసేందుకు ప్రయత్నించారు. గతంలో పలు ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మైలార్ దేవులపల్లిలో ఉన్న మత్తూట్ ఫైనాన్స్ కంపెనీ ఉంది. ఈ కార్యాలయంలోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించారు. కత్తులు..తుపాకులతో అసిస్టెంట్ మేనేజర్ లతీఫ్ ను బెదిరించారు. కొంత ధైర్యం చేసిన లతీఫ్ అక్కడనే ఉన్న అలారాన్ని నొక్కాడు. అలారం పెద్ద శబ్ధం చేయడంతో దొంగలు కాలికి పని చెప్పారు. దొంగలు ప్రవేశించడం..పరారు కావడం దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
సమాచారం తెలసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments
Post a Comment