రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయ‌డానికి రాష్ట్ర ప్రభుత‍్వం సంక్షేమ కార‍్యక్రమాలు

నాగర్ కర్నూల్: జిల్లాలోని ఉర్కొండ మండలంలో వ్యవ‌సాయ‌శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మంగళవారంపర‍్యటించారు. రేవల్లి గ్రామానికి చేరుకున్న మంత్రి పోచారం గ్రామంలో మినీ భూసార పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార‍్యక్రమంలో జిల్లా మంత్రి లక్ష్మారెడ్డి. ఉద్యానవన, వ్యవసాయ శాఖ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.
గ్రామంలో 156 మంది రైతులకు తుంపర పరికరాలు, బిందు సేద్యం పరికరాలను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ... రైతుల సంక్షేమ‌మే ప్రభుత‍్వ ద్యేయ‌మ‌న్నారు. రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయ‌డానికి రాష్ట్ర ప్రభుత‍్వం సంక్షేమ కార‍్యక్రమాలు చేప‌ట్టింద‌ని తెలిపారు. రైతు సమ‌గ్ర స‌ర్వేలో వివ‌రాలు అందించని రైతులు వీఆర్‌వోల‌ను, ఏవోల‌ను క‌లిసి వివ‌రాలు స‌మ‌ర్పించాల‌ని సూచించారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు