నాకు ఆసరాగా నిలుస్తున్న మిత్రులకు కృతజ్ఞతలు



ప్రేమిస్తే సినిమాలో ‘నటిస్తే హీరో.. ఆ తర్వాత రాజకీయాలు.. తర్వాత సీఎం… అంతవరకు వెయిట్‌ చేస్తా సార్‌!’ అంటూ చెప్పి అందరిని ఆకట్టుకున్న కమెడియన్ ‘పల్లు’బాబు..ఆ తర్వాత మూడు , నాల్గు చిత్రాల్లో నటించాడు. ఆ తర్వాత అవకాశాలు రాకపోయేసరికి , ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం తో గుడి ముందు బిచ్చం ఎత్తుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ విషయం సోషల్ మీడియా లో విపరీతంగా ప్రచారం కావడం తో ‘పల్లు’బాబు గురించి తెలుసుకున్న స్టంట్‌నటుడు సాయిదీనా, దర్శకుడు మోహన్‌లు అక్కడివి వెళ్లి బాబును తమ ఇంటికి తీసుకొచ్చారు.
వీరు మాట్లాడుతూ… ‘‘ బాబు ఆరోగ్యంగానే ఉన్నారు. ఆయన మానసికంగా ఇబ్బంది పడుతున్నారనే వార్తలు అవాస్తవం. ఇప్పుడు కొందరు దర్శకులు ఫోన్‌ చేసి అవకాశం ఇస్తామని చెబుతున్నారు. ఆయన మళ్లీ తమిళ సినిమాల్లో నటించి సాధారణ స్థాయికి వస్తార’’ని పేర్కొన్నారు. బాబు మాట్లాడుతూ… ‘‘కొంత కాలంగా అవకాశాల కోసం ఎదురుచూస్తునా. కానీ రాకపోవడంతో జీవనం గడపడం కూడా కష్టతరంగా మారింది. ఇప్పుడు నాకు ఆసరాగా నిలుస్తున్న మిత్రులకు కృతజ్ఞతల’’ని చెప్పుకొచ్చాడు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు