రూ. 600 కోట్ల బడ్జెట్: సూపర్‌స్టార్ లుక్

రూ. 600 కోట్ల బడ్జెట్: సూపర్‌స్టార్ లుక్

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌కు సౌత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగులో 'జనతా గ్యారేజ్' తర్వాత ఆయన సినిమాలకు ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. అందుకే మన్యంపులి, కనుపాప ఇక్కడ మంచి విజయమే నమోదు చేశాయి.
త్వరలో మోహన్ లాల్ 'ఓడియన్' అనే మలయాళ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందకు రాబోతున్నారు. సోమవారం చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో మోహన్ లాల్ లుక్ చూసిన వారంతా షాకవుతున్నారు. ఇక ఆయన అభిమానులైతే ఆయన లుక్ కిరాక్‌గా ఉందంటూ ప్రశంసిస్తున్నారు.


60 ఏళ్ల సూపర్ స్టార్ యువకుడిలా...

ప్రస్తుతం మోహన్ లాల్ వయసు 57 సంవత్సరాలు. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన సినిమాలన్నీ వయసుకు తగిన విధంగానే ఉన్నాయి. అయితే ఈ చిత్రంలోని ఓ పాత్రలో మోహన్ లాల్ యువకుడిలా కనిపించబోతున్నారని తెలుస్తోంది. అందుకు తగిన విధంగానే ఆయన్ను సూపర్బ్‌గా మేకోవర్ చేశారు.

పీటర్ హెయిన్స్

మోహన్ లాల్ నటించిన ‘మన్యంపులి' చిత్రానికి అద్బుతమైన స్టంట్స్ కంపోజ్ చేసిన పీటర్ హెయిన్స్ ‘ఓడియన్' చిత్రానికి కూడా పని చేస్తున్నారు. ఆయన తన ట్విట్టర్ పేజీ ద్వారా ఈ చిత్రం మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.

శ్రీకుమార్ దర్శకత్వం

‘ఓడియన్' చిత్రానికి విఎ శ్రీకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ లాల్ ఓడియన్ మానిక్యన్ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

రూ. 600 కోట్ల బడ్జెట్

‘ఓడియన్' చిత్రాన్ని రూ. 600 బడ్జెట్‌తో ఆంటోనీ పెరంబవూర్ నిర్మిస్తున్నారు. ఇదో ఫాంటసీ సబ్జెక్టుతో తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇండియాలో ఇప్పటి వరకు ఏ చిత్రానికి ఇంత పెద్ద బడ్జెట్ ఖర్చు పెట్టలేదు. మళయాలంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇంత బడ్జెట్ తో సినిమా అంటే ఏ స్థాయిలో ఉంటుందో?


Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు