చంటి పాపను 5,500 రూపాయలకు అమ్మకానికి పెట్టింది ఓ తల్లి
మాతృత్వపు మమకారమే వేరు! తల్లి తానెంత పేదరాలైనా.. చివరకు పస్తులుండి కూడా బిడ్డల కడుపు నింపేందుకు పరితపిస్తుంది. ఈ తల్లి ఎంత దుర్మార్గురాలో కదా! కేవలం తన పొట్ట నింపుకొనేందుకే పిల్లలను కంటోంది. పచ్చిగా చెప్పాలంటే.. వారితో బిక్షాటన చేయించేందుకు, బేరం కుదిరితే అమ్మేసేందుకే గర్భం దాల్చుతోంది. ఇలా ఆమె ఏకంగా ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. వారితో భిక్షాటన చేయిస్తూ వచ్చిన డబ్బుతో బతికేస్తోంది. శనివారం మధ్యా హ్నం ఆమె మరో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పక్కనే తీవ్ర అనారోగ్యంతో రెండున్నరేళ్ల కూతురు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతుండగానే.. తన నెత్తుటి గుడ్డును ఓ జంటకు 5,500 రూపాయలకు అమ్మకానికి పెట్టింది. తల్లి తనానికి మచ్చ తెచ్చేలా ప్రవర్తించిన ఆ తల్లి.. ఖమ్మంజిల్లా కేంద్రానికి చెందిన సమ్మక్క. ఈమె సొంతూరు గార్ల. నగరానికి చెందిన చామల భగవాన్‌తో 15 ఏళ్ల క్రితం పెళ్లయింది. అప్పటి నుంచి వారు ఖమ్మం రంగనాయకుల గుట్ట ప్రాం తంలో నివాసం ఉంటున్నారు. రిక్షా తోలుతున్న భగవాన్ తాగుడుకు బానిసయ్యాడు. సమ్మక్క మాత్రం పిల్లలతో భిక్షాటన చేయిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ దంపతులకు ఇప్పటికే ఐదుగురు పిల్లలున్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో సమ్మక్క ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కొద్దిసేపటికే తన బిడ్డను విక్రయిస్తానని ఆస్పత్రిలో స్వీపర్‌గా పనిచేస్తున్న జ్యోతికి చెప్పింది. ఆమె విషయాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చేతకొండకు చెందిన రాచర్ల శ్రీనివా్‌సకు విషయం చేరవేసింది. ఆయ న ఆదివారం ఉదయాన్నే తన భార్య వెంకటరమణ, తల్లి భారతమ్మతో కలిసి ఆస్పత్రికి వచ్చి ఆ పసికందును తీసుకెళ్లారు. అక్కడే ఉ న్న అన్నం సేవా ఫౌండేషన్ సభ్యులకు విషయం తెలిసి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఆ దంపతుల నుంచి బిడ్డను స్వాధీనం చేసుకొని, ఆస్పత్రిలో రక్షణ కల్పిస్తున్నారు.


Comments
Post a Comment