బంజారాహిల్స్లోని రోడ్ నెం.3లో డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి

హైదరాబాద్: హైదరాబాద్ బంజారాహిల్స్లోని రోడ్ నెం.3లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ వైపు అతివేగంగా వస్తున్న ఐ10 కారు డివైడర్ను ఢీకొట్టడంతో పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, గాయపడిన ఇద్దరిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆ మార్గంలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారును తొలగించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. మితిమీరిన వేగంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు