ఐదు వన్డేల సిరిస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది.

 జింబాబ్వే క్రికెట్ జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది. శ్రీలంక‌పై వ‌న్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. సోమవారం హంబ‌న్‌తోటలో జ‌రిగిన ఐదో వన్డేలో 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంలో ఐదు వన్డేల సిరిస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది.
ఎనిమిదేళ్ల తర్వాత జింబాబ్వే విదేశీ గడ్డపై తన తొలి సిరిస్‌ను గెలిచింది. చివరిసారిగా 2009లో కెన్యాపై జింబాబ్వే వన్డే సిరిస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది.
అనంతరం 204 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన 37.1 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. చివ‌ర్లో సికంద‌ర్ రాజా కీల‌క ఇన్నింగ్స్ ఆడ‌టంతో జింబాబ్వే అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో లంక బౌల‌ర్ ద‌నంజ‌య ఆరు వికెట్లు తీసుకున్నాడు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు