రూ. 25 కోట్లతో ఆడియో ఫంక్షన్

రూ. 25 కోట్లతో ఆడియో ఫంక్షన్


ఈ మధ్య సినిమాల ఆడియో ఫంక్షన్స్ చాల గ్రాండ్ జరుపుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు నిర్మాతలు.. తాజాగా ఓ ఆడియో ఫంక్షన్ కు ఏకంగా 25 కోట్లు ఖర్చు చేయబోతున్నారట. ఈ ఖర్చుతో ఓ మీడియమ్ సినిమానే తీయవచ్చు. కానీ ఈ నిర్మాతలు మాత్రం ఆడియోకే అంత ఖర్చు చేయడం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ ఆ మూవీ ఏంటి అని చూస్తున్నారా అదే శంకర్ రోబో 2 .
రజనీకాంత్ హీరో గా అక్షయ్ కుమార్ విలన్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని , ప్రమోషన్స్ షురూ చేసింది . ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్న ఎ ఆర్ రెహమాన్ రీ రికార్డింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేశాడట. అక్టోబర్లో ఈ సినిమా ఆడియో వేడుకను జరపాలనే డిసైడ్ అయ్యారు. ‘దుబాయ్’లో 25 కోట్ల ఖర్చుతో ఈ ఫంక్షన్ ను నిర్వహించబోతున్నట్టు సమాచారం .

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు