విద్యాసంస్థల్లో ఈనెల 15వ తేదీన గ్రీన్ డే:కడియం
15న గ్రీన్ డే : కడియం
హైదరాబాద్ : తెలంగాణలోని అన్ని విద్యాసంస్థల్లో ఈనెల 15వ తేదీన గ్రీన్ డే నిర్వహిస్తామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. హరితహారంపై ఆయన సోమవారం విద్యా శాఖ అధికారులతో సమీక్ష చేశారు. 30 వేల విద్యా సంస్థల్లో 50 లక్షల మొక్కలు నాటుతామని ఆయన పేర్కొన్నారు. 15వ తేదీన మొక్కలు నాటడం, ర్యాలీలు, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. డ్రగ్స్ విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు. ఈ వ్యవహారంలో ఎంత పెద్దవారున్నా వదిలే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

Comments
Post a Comment