ఐటీ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్న నగరాల్లో బెంగళూరు నెం.1 హైదరాబాద్ నెం.2

బెంగళూరు నెం.1 హైదరాబాద్ నెం.2

అందుబాటులో ఉన్న ఐటీ ఉద్యోగాల పరంగా చూస్తే.. ఇప్పటికీ బెంగళూరు తన హవా కొనసాగిస్తోందని యూత్‌4వర్క్‌ డాట్‌ కామ్‌ సర్వే పేర్కొంది. ఐటీ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్న నగరాల్లో బెంగళూరు (30 శాతం) అగ్రస్థానంలో నిలిచింది. హైదరాబాద్‌ (19 శాతం), దిల్లీ (17 శాతం), అహ్మదాబాద్‌ (12 శాతం), ముంబయి (11 శాతం), చెన్నై (11 శాతం)లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఒకప్పుడు బెంగళూరుకు మాత్రమే పరిమితమైన ఉద్యోగాలు, ఇప్పుడు చెన్నై, ముంబయి, అహ్మదాబాద్‌, దిల్లీ, హైదరాబాద్‌లకు సైతం వ్యాపిస్తున్నాయని సర్వే వెల్లడించింది. 28 శాతం బెంగళూరు యువత సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తుంటే.. ఆ తర్వాతి స్థానాల్లో హైదరాబాద్‌ (23 శాతం), దిల్లీ (22 శాతం), ముంబయి (15 శాతం), చెన్నై (10 శాతం)లు తర్వాత నిలిచాయి.
ఇక దిల్లీలో 26 శాతం మంది యువత హార్డ్‌వేర్‌ ఉద్యోగాలకు మొగ్గుచూపుతున్నారు. ఈ సంఖ్య బెంగళూరు (24 శాతం), హైదరాబాద్‌ (20 శాతం), చెన్నై (12 శాతం)లో చొప్పున ఉన్నాయి.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు