Posts

Showing posts from July, 2017

సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్ :లక్ష రూపాయల రివార్డు

Image
హైదరాబాద్: మాదక ద్రవ్యాల సరఫరాకు సంబంధించి సమాచారం అందించే వారికి లక్ష రూపాయల రివార్డు అందిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్ కేసులో విచారణను పారదర్శకంగా, చిత్తశుద్దితోనూ నిర్వహించాలని పోలీసు ఉన్నతాధికారులకు కేసీఆర్ సూచించారు. శుక్రవారం సాయంత్రం పోలీస్ శాఖ ఉన్నతాధికారులు అనురాగ్ శర్మ, సీపీ మహేందర్ రెడ్డి, అకున్ సబర్వాల్ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. డ్రగ్స్ కేసు దర్యాప్తు వివరాలను అధికారులు కేసీఆర్‌కు వివరించారు. కేసును పారదర్శకంగా, చిత్తశుద్ధితో నిర్వహించి సామాజిక రుగ్మతలను సంపూర్ణంగా రూపుమాపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ ఉన్నతాధికారులతో భేటీ అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. సినీ రంగాన్ని టార్గెట్ చేశారన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. డ్రగ్స్ సరఫరా, పేకాట క్లబ్బులు, గంజాయి సరఫరా, పోకిరీల ఆగడాలపై ప్రభుత్వానికి సమాచారం అందించే వారికి లక్ష రూపాయల రివార్డు అందించనున్నట్లు ప్రకటించారు. 

క్రికెటర్ మిథాలీరాజ్‌ కు భారీ నజరానా:కేసీఆర్

Image
హైదరాబాద్: ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను మహిళా క్రికెటర్‌ మిథాలీరాజ్‌ కలిశారు. ఈ సందర్బంగా మిథాలీరాజ్‌కు రూ. కోటి బహుమానాన్ని కేసీఆర్ ప్రకటించారు. బంజారాహిల్స్‌లో 600 గజాలకు తక్కువ కాకుండా స్థలాన్ని కేటాయిస్తామన్నారు. మిథాలితో పాటుగా కోచ్‌ మూర్తికి రూ.25 లక్షల బహుమానం కేసీఆర్‌ ప్రకటించారు. వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను చూశానని, వరల్డ్‌కప్‌లో బాగా ఆడారంటూ మిథాలీరాజ్‌ను కేసీఆర్‌ అభినందించారు. 

నిమ్మగడ్డ ప్రసాద్ భూములను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్

Image
హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ భూములను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. రూ. 148.89 కోట్ల విలువైన భూములను అటాచ్‌మెంట్ చేస్తూ ఈడీ శుక్రవారం ఉత్తర్వులను జారీచేసింది. జగన్ అక్రమాస్తులకు సంబంధించి వ్యాంపిక్ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌ అప్పట్లో అరెస్టు అయిన విషయం తెలిసిందే. 

పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కు ఎదురుదెబ్బ

Image
నవాజ్ షరీఫ్ పై అనర్హత వేటు ఇస్లామాబాద్: పనామా పేపరు కేసులో పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కు ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు ఆయనను ప్రధాని పదవీ నుంచి తొలగిస్తూ సంచలన తీర్పునిచ్చింది.  ఆయనపై అనర్హత వేటును వేసింది. వెంటనే ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది. షరీఫ్ తోపాటు ఆయన కుటుంబ సభ్యులపై కూడా క్రిమినల్ కేసుకు కోర్టు ఆదేశించింది.

త్వరలో క్లౌడ్‌ హబ్‌ పాలసీ: మంత్రి లోకేష్

Image
గుంటూరు: మంగళగిరి పట్టణం మినీ అమీర్‌పేటగా మారుతుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మంగళగిరి కేంద్రంగా పలు ఐటీ శిక్షణా కేంద్రాలు రాబోతున్నాయని మంత్రి అన్నారు. అలాగే ప్రపంచస్థాయి ప్రమాణాలతో అవరావతికి డేటా సెంటర్‌ రావడం సంతోషకరంగా ఉందన్నారు. ఆగ్నేయాసియాలోనే అతిపెద్ద డేటా కేంద్రాల్లో ఒకటిగా నిలవనుందని, త్వరలో క్లౌడ్‌ హబ్‌ పాలసీ తీసుకురాబోతున్నామని ఆయన తెలిపారు. అంతేగాక రెండేళ్లలో లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఎలక్ట్రానిక్స్‌లో ఏపీ శరవేగంగా దూసుకుపోతోందని మంత్రి పేర్కొన్నారు. 

నేటి నుండి పీకేఎల్‌ ఐదో సీజన్‌

Image
హైదరాబాద్‌ :  హైదరాబాద్‌లోని గచ్చిబౌలీ స్టేడియంలో శుక్రవారం పీకేఎల్‌ ఐదో సీజన్‌కు తెరలేవనుంది. గత నాలుగు సీజన్లలో పెద్ద సంఖ్యలో అభిమానుల్ని సంపాదించుకున్న పీకేఎల్‌ ఐదో సీజన్‌కు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమైంది. కొత్తగా 4 జట్లు చేరడంతో మొత్తం 12 జట్లు 13 వారాల పాటు 138 మ్యాచ్‌లతో హోరెత్తించనున్నాయి. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పట్నా పైరేట్స్‌ హ్యాట్రిక్‌పై కన్నేయగా.. జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌, యు ముంబా రెండో టైటిల్‌పై గురిపెట్టాయి. తెలుగు టైటాన్స్‌, పుణెరి పల్టాన్‌, బెంగళూరు బుల్స్‌, దబాంగ్‌ ఢిల్లీ, బంగాల్‌ వారియర్స్‌ మొదటిసారి ట్రోఫీని ముద్దాడాలని ఉవ్విళ్ళూరుతుండగా.. తమిళ్‌ తలైవాస్‌, హరియాణా స్టీలర్స్‌, గుజరాత్‌ ఫార్చున్‌ జెయింట్స్‌, యూపీ యోధా అరంగేట్ర సీజన్‌లోనే అదరగొట్టాలని కృతనిశ్చయంతో బరిలో దిగుతున్నాయి. మరి ఏ జట్టు మెరుస్తుందో.. ఏ అభిమానులు మురుస్తారో అక్టోబరు 28న జరిగే ఫైనల్లో తేలిపోతుంది! ఆరంభోత్సవానికి తారలు: శుక్రవారం గచ్చిబౌలీ స్టేడియంలో తారల సందడి కనిపించనుంది. సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు పీకేఎల్‌ ఐదో సీజన్‌ ఆరంభ వేడుకలు జరుగనున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, తారల నృత...

విక్రమ్ గౌడ్ నోరు విప్పితే అన్ని వివరాలు బయటకు వస్తాయి:డీసీపీ

Image
హైదరాబాద్: మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్‌పై కాల్పుల జరిగాయని వెస్ జోన్ డిసిపి వెంకటేశ్వర్ రావు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. కుడి చేతి నుంచి ఎడిమ చేతి వైపు బుల్లెట్ దూసుకెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఇంటిలోకి ఎవరైనా వచ్చారా అని విచారణ చేస్తున్నామన్నారు. ఇప్పటికే నాలుగు పోలీస్ బృందాలను రంగంలోకి దించి విచారణ చేపట్టామన్నారు. విక్రమ్ గౌడ్ నోరు విప్పితే అన్ని వివరాలు బయటకు వస్తాయని చెప్పారు. విక్రమ్ గౌడ్‌కు వెపెన్ లైసెన్స్ లేదని డిసిపి పేర్కొన్నారు.

సిట్ అధికారులతో నటి ముమైత్ ఖాన్ విచారణ పూర్తి

Image
హైదరాబాద్ : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సిట్ అధికారులతో నటి ముమైత్ ఖాన్ విచారణ పూర్తి అయింది. గురువారం ఉదయం నాంపల్లి అబ్కారి కార్యాలయంలో విచారణకు హాజరయిన ఆమెను సిట్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మహిళ బృందం దాదాపు 6 గంటల పాటు విచారించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఛార్మి కౌర్‌ను విచారించినట్టుగానే ముమైత్‌ఖాన్‌ విచారణను కూడా సాయంత్రం 5 గంటలలోపే విచారణను ముగించారు.

మోహన్ లాల్, విశాల్ భారీ చిత్రం

Image
ఉన్ని కృష్ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌ల‌యాళ మెగాస్టార్ మోహ‌న్ లాల్ ప్ర‌ధాన పాత్ర‌గా తెర‌కెక్కుతున్న భారీ మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం విల‌న్ . మోహ‌న్ లాల్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో తెలుగు నటుడు శ్రీకాంత్, తమిళ నటుడు విశాల్, హీరోయిన్ హన్సికలతో పాటు తెలుగు స్టార్ హీరోయిన్ రాశి ఖన్నా కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మూవీ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. విలన్ చిత్రంలో మోహన్ లాల్.. మాథ్యూ మనోరంజన్ అనే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఆయనకి భార్యగా మంజూ వారియర్ నటిస్తుంది. 

డిప్యూటీ కలెక్టర్‌గా సింధు: చంద్రబాబు

Image
డిప్యూటీ కలెక్టర్‌గా సింధు: చంద్రబాబు హైదరాబాద్: రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్ 1 ఆఫీసర్‌గా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. 2016 రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు భారత్‌కు రజత పతకం అందించింది. ఈ నేపథ్యంలో పీవీ సింధుకు గ్రూప్-1 ఉద్యోగం ఇస్తామ‌ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం చంద్రబాబు సింధుకు స్వయంగా ప్రభుత్వ ఉత్తర్వు కాపీని అందజేశారు. అనంతరం అపాయింట్‌మెంట్ లెట‌ర్ అంద‌జేస్తున్న ఫొటోను ఆయ‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. భ‌విష్య‌త్తులో దేశానికి సింధు మ‌రింత ఖ్యాతిని తీసుకొస్తుంద‌ని ఆశిస్తున్న‌ట్లు ఆయ‌న ట్వీట్‌లో ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం సింధు మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ కలెక్టర్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి నియామక పత్రం అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తన తొలి ప్రాధాన్యత బ్యాడ్మింటన్‌కేనని సింధు స్పష్టం చేసింది. 

నితీశ్ నమ్మక ద్రోహి: లాలూ

Image
బీహార్: ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై ఆర్‌జెడి నేత లాలూ ప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. పదవి కోసం నితీశ్ ఎదైనా చేస్తారని తెలిపారు. తన పై వచ్చిన అవినీతి ఆరోపణల వెనుక నితీశ్ హస్తం ఉందని వెల్లడించారు. దేశ ప్రజలను బిజెపి మోసం చేస్తోందని దుయ్యబట్టారు. నితీశ్ నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి మోసాలను ప్రజల్లోకి వెళ్లి ఎండగడతామని లాలూ పేర్కొన్నారు.

అబ్దుల్ కలాం స్మారక మండపం ప్రారంభం

Image
తమిళనాడులోని రామేశ్వరంలో నిర్మించిన అబ్దుల్ కలాం స్మారక మండపాన్ని ప్రధాని నరేంద్రమోడీ గురువారం ఉదయం ప్రారంభించారు. రామేశ్వరం సమీపంలోని తంగచ్చిమఠం ప్రాంతంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమాధి ఉన్న విషయం తెలిసిందే. అక్కడ కేంద్ర ప్రభుత్వం పదిహేను కోట్ల వ్యయంతో కలాం స్మారక మండపాన్ని నిర్మించింది. గురువారం కలాం రెండో వర్ధంతి సందర్భంగా ఆయన స్మారక మండపాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. మండపంలో ఏర్పాటు చేసిన కలాం విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించారు. అనంతరం కలాం సమాధి వద్ద మోడీ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌డిఎ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు, తమిళనాడు ఇన్‌ఛార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావు, సిఎం పళనిస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఓటరు నమోదు లో కళాశాల ప్రిన్సిపల్స్ ముఖ్యపాత్ర వహించాలి

Image
     జనగామ:  కలక్టరేట్ లో డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్ తో  బుదవారం నిర్వహించిన సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి మాలతి మాట్లాడుతూ ఓటర్ల నమోదు శాతం పెంచేందుకు తమతమ కళాశాలలో 18 సంవత్సరంలు వయస్సు నిండిన వారికి ఓటు హక్కు పై అవగాహన కల్పించాలని, అర్హత కల్గిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకునేందుకు, తద్వారా ఎన్నికలలో ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలని అన్నారు. ప్రతి కళాశాలలోను ఒక ఉపాధ్యాయునిని నోడల్ ఆఫీసర్ గా నియమించుకోవాలని, ఉత్సాహవంతులైన ఇద్దరు విద్యార్థులను ఓటర్ల నమోదుకు అంబాసిడార్లుగా నియమించుకోవాలని తెలిపారు. ప్రతి కళాశాలకు వారు కోరిన మేర కొత్తగా ఓటర్ల నమోడుకు అవసరమైన ఫారం-6, ఓటర్ల జాబితాలో తప్పొపులు సవరించేందుకు అవసరమైన ఫారం-8, పోలింగ్ స్టేషన్ల మార్పు చిరునామా మార్పుకు ఫారం-8Aలను ఇస్తామని ఆమె ఈ సందర్భంగా ప్రిన్సిపల్స్ కు తెలిపారు. తేది:01-01-2017 నాటికి 18 సంవత్సరాల వయస్సు, ఆ పైన వున్న వారందరు ఓటరుగా పేరు నమోదుకు అర్హులని అన్నారు. విద్యార్థుల భాగస్వామ్యం కోసం భారత ఎన్నికల సంఘం ఈ సంవత్సరం స్వీప్ (సిస్టమెటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టరోల్ పార్టిస...

వేధింపుల పర్వంలో మరో మలయాళ నటి మైథిలి ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్

Image
మళయాళీ హీరోయిన్ భావన వేధింపుల ప‌ర్వం కేసు విచార‌ణ‌లో ఉండ‌గానే మ‌రో కేసు బ‌య‌ట‌కు వ‌చ్చింది.. మరో మళయాళ నటి మైథిలి న్యూడ్ ఫోటోల‌ను ఒక ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటీవ్ ఏకంగా సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో పోస్ట్ చేశాడు.. ఈ విషయం తెలిసిన వెంట‌నే ఆ న‌టి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.. వెంట‌నే అత‌డ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.. ఈ కేసు గురించి పోలీసుల తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ కిరణ్ కుమార్ దా దాపు పదేళ్లగా నటి మైథిలితో ప‌రిచ‌యం ఉంది..అత‌డు పెళ్లి అయిందనే విషయం దాచిపెట్టి ఆమెకు దగ్గరవాలని ప్రయత్నించాడు. చివరకు ఈ విషయం తెలిసిన ఆమె అతడిని దూరం పెట్టింది. దీంతో కిరణ్ కుమార్ ఆమెను అసభ్యంగా తీసిన న్యూడ్ ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టాడు. తాను కోరినంత డబ్బివ్వకపోతే ఈ ఫొటోలు నెట్ లో పెడతానంటూ బెదిరించాడు. ఆమె ఆ బెదిరింపులను లెక్క చేయకపోవడంతో ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడవి అక్కడ వైరల్ గా మారాయి. దీంతో నటి మైథిలి దీనిపై ఎర్నాకులం పోలీసులకు కంప్లయింట్ చేసింది.. దీనిపై వెంట‌నే స్పందించిన పోలీసులు అత‌డిపై కేసు న‌మోదు చేసి విచార‌ణ జ‌రుపుతున్నారు.

డ్ర‌గ్స్ కేసు సాయంత్రం 5 గంట‌ల‌కు మీడియాకు వెల్ల‌డి :ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌ర్ అకున్ స‌బ‌ర్వాల్

Image
  హైద‌రాబాద్: డ్ర‌గ్స్ కేసులో ఐదో రోజు విచార‌ణ ఇవాళ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. హీరో న‌వ‌దీప్ ఇవాళ సిట్ ముందు హాజ‌ర‌య్యాడు. అయితే.. డ్ర‌గ్స్ కేసులో విచార‌ణ కు సంబంధించిన వివ‌రాల‌ను సాయంత్రం 5 గంట‌ల‌కు మీడియాకు వెల్ల‌డిస్తామ‌ని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌ర్ అకున్ స‌బ‌ర్వాల్ తెలిపారు. ఇవాళ అకున్ స‌బ‌ర్వాల్, ఎక్సైజ్ క‌మిష‌న‌ర్ చంద్ర‌వ‌ద‌న్ అన్ని జిల్లాల ఎక్సైజ్ అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ లో పాల్గొన్నారు. గుడంబా నిర్మూల‌న‌, పున‌రావాస చ‌ర్య‌లు, హ‌రిత‌హారంపై ఈ సంద‌ర్భంగా ఎక్సైజ్ అధికారుల‌తో స‌మీక్షించామ‌ని అకున్ తెలిపారు.

అత్యంత ప్రియమైన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు: సమంత

Image
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భాంగా ప్రముఖ నటి తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ అయినా సమంత కేటీఆర్ ఫై పొగడ్తల వర్షం కురిపించింది. తన ట్విట్టర్ ద్వారా ‘‘అత్యంత ప్రియమైన నాయకుడికి శుభాకాంక్షలు. నిజమైన స్ఫూర్తి, నమ్మకం కలిగించే మీతో పరిచయం ఏర్పడడం గౌరవంగా భావిస్తున్నా సర్’’ అంటూ సమంత ట్వీట్ చేసి కేటీఆర్ తో పాటు తెలంగాణ ప్రజల మనసు దోచుకుంది. సమంత ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ‘‘మా చేనేత ప్రచారకర్తకు చాలా ధన్యవాదాలు. మీ ఫోకస్, డెడికేషన్‌తో నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చారు. వొవెన్2017(చేనేత వస్త్రాల ఫ్యాషన్ షో) కోసం ఎదురు చూస్తున్నా.’’ అని సమాధానం ఇచ్చారు. అందుకు సమంత ప్రతిస్పందిస్తూ ‘ధన్యవాదాలు సర్’ అని తెలిపింది.

హై కోర్టులో పిటిషన్ వేసిన ఛార్మి

Image
హై కోర్టులో పిటిషన్ వేసిన ఛార్మి ఈ మధ్య తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసులో కొంతమంది ప్రముఖుల పేర్లు వినిపించిన విషయం తెలిసిందే. అందులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ గారు, కథానాయకుడు రవితేజ, సుబ్బరాజు , తరుణ్ , నవదీప్, ఛార్మి, ముమైత్ ఖాన్ తదితరులు ఉన్న విషయం తెలిసిందే.కాగా కొన్ని రోజుల నుండి ఒక్కక్కరుగా సిట్ విచారణకు హాజరవుతున్న విషయం కూడా తెలిసిందే. ఇప్పటి వరకు పూరి, తరుణ్ ,శ్యామ్ కే నాయుడు , సుబ్బరాజు ,తరుణ్ తదితరులు విచారణకు హయరయ్యారు. కాగా ఈ విచారణపై దర్శకుడు పూరీ జగన్నాథ్ స్పందించారు. విచారణతరువాత ఎక్సైజ్ శాఖ కార్యాలయం నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన ఆయన తన ట్విట్టర్ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో మీడియా తన జీవితం నాశనం చేసింది అని చెప్పిన విషయం కూడా తెలిసిందే. కాగా ఆ తరువాత రోజు ఈ వీడియో పై నటుడు ప్రకాశ్ రాజ్ నిజానిజాలు తెలుసుకోకుండా ప్రచారం చేయడం తగదు అని స్పందించిన విషయం కూడా తెలిసిందే. కాగా ఈరోజు తాజాగా ఈ విషయం మీద కథానాయిక ఛార్మి హై కోర్టును ఆశ్రయించారు. విచారణలో తమ ప్రమేయం లేకుండా రక్త నమూనాలు సేకరిస్తున్నారని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 ప...

నకిలీనోట్లను గుర్తించే పనిలో ఆర్‌బీఐ

Image
పెద్దనోట్ల రద్దు తర్వాత ఆర్‌బీఐ శాఖలకు పెద్దమొత్తంలో వచ్చి చేరిన పాత రూ.500, రూ.వెయ్యి నోట్లలో నకిలీ నోట్ల ఏరివేతకు ఆర్‌బీఐ చర్యలు ప్రాంభించింది. ఇందుకు గానూ నకిలీ నోట్లను గుర్తించి లెక్కించే 12 పరిశీలన యంత్రాలను ఆరు నెలల పాటు అద్దెకు తీసుకోనుంది. పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రస్తుతం ఎన్ని నోట్ల తిరిగి వచ్చాయనే అంశంపై ఆర్‌బీఐ లెక్కింపు చేపట్టింది. దీనికి సంబంధించి 18 నోట్ల పరిశీలన యంత్రాల కొనుగోలుకు మే నెలలో టెండర్లను ఆహ్వానించి.. అనంతరం రద్దు చేసింది. తాజాగా సెకెన్‌కు 30 నోట్లు లెక్కింపు సామర్థ్యం కలిగిన 12 యంత్రాల కోసం టెండర్లు ఆహ్వానించింది. ఇటీవల పార్లమెంట్‌ స్థాయీ సంఘం ముందు హాజరైన ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌.. రద్దయిన నోట్లకు సంబంధించిన లెక్కింపు కొనసాగుతోందని తెలిపారు. లెక్కింపు పూర్తయితే గానీ ఎన్ని నోట్లు వచ్చాయన్నది చెప్పలేమని స్పష్టంచేశారు.

పాకిస్థాన్ ను హెచ్చరించిన వెంకయ్య నాయుడు

Image
పీవోకే సహా కాశ్మీర్‌లోని ప్రతి ఇంచ్ భారత్‌దే అన్నారు వెంకయ్యనాయుడు… కార్గిల్ వార్‌లో అమరులైన వారికి ఆయన నివాళులర్పించారు. ఢిల్లీలో జరిగిన కార్గిల్ పరాక్రమ్ పరేడ్‌కు హాజరయ్యారు వెంకయ్యనాయుడు… అమరవీరులను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. కార్గిల్‌ లాంటి ప్రతీకూల ప్రాంతంలో యుద్ధం చేసిన మన సైన్యం పరాక్రమాలను ప్రశంసించారు వెంకయ్యనాయుడు… భారత్ – పాకిస్థాన్ సరిహద్దులో చొరబాట్లను నిలిపివేయాలని పాక్‌కు సూచించారు. భారత్‌ శాంతిని కోరుకుటుందన్న వెంకయ్యనాయుడు… కానీ అవసరమైతే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న 125 కోట్ల భారతీయులు ధీటైన జవాబే ఇస్తారని తెలిపారు.

జూ.ఎన్టీఆర్ కొత్త పార్టీ : ‘సమసమాజ్‌’ పార్టీ

Image
  జై లవకుశ  తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీయార్‌ రాజకీయనాయకుడిగా కూడా కనిపించబోతున్నాడట. ‘సమసమాజ్‌’ పార్టీ నేతగా ఎన్టీయార్‌ కనిపించనున్నాడట. ఆ పాత్రకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ‘సమసమాజ్‌’ పార్టీ జెండాలు, వాటి మీద ఎన్టీయార్‌ బొమ్మలు ఉన్న ఫోటలు వర్కింగ్‌ స్టిల్స్‌గా బయటకు వచ్చాయి. అయితే ఆ జెండాలపై పేరు ఇంగ్లీష్‌, హిందీ బాషల్లో ఉండడంతో.. ఎన్టీయార్‌ ఉత్తరాదికి చెందిన రాజకీయనాయకుడిగా కనిపించబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది.

పురిటి నొప్పులతో ఉన్న గర్భిణిని 16 కిలోమీటర్లు మోసుకెళ్లారు

Image
 పురిటి నొప్పులతో ఉన్న గర్భిణిని 16 కిలోమీటర్లు మోసుకెళ్లారు… ఆర్థిక స్తోమతలేక భుజంపై శవాలను మోయడం, పురిటి నొప్పులతో గర్భిణి 15 కిలోమీటర్లు పైగా నడిచిన ఘటనలు చూశాం… ఒడిశాలో ఆలాంటి ఘటనే మరోటి వెలుగుచూసింది… గర్భిణీ స్త్రీల సంరక్షణకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా మౌలిక సదుపాలు, దానికి తోడు ప్రకృతి కోపంతో ఏకంగా 16 కిలోమీటర్ల దూరం గర్భిణిని మోసుకెళ్లాల్సి వచ్చింది. ఒడిశాలోని నియమ్‌గిరి పర్వత ప్రాంతాల్లోని కాచ్‌బండెల్ గ్రామం నుంచి సదరు గర్భిణిని భుజనాలపైనే 16 కిలోమీటర్లు తీసుకెళ్లారు. ఆదివాసీ గర్భిణిని ఆస్పత్రికి చేర్చడానికి 16 కిలోమీటర్ల దూరం అత్యంత కష్టంపై మరో వ్యక్తి సహాయంతో గర్భిణి భర్త మోసుకెళ్లారు. ఆ గర్భిణిని ఓ బట్టలో పడుకోబెట్టి… ఓ కర్రకు కట్టి ఆ ఇద్దరు తమ భుజాలపై పెట్టుకుని 16 కిలో మీటర్ల దూరం మోశారు. ఆస్పత్రికి చేర్చడానికి 102 అంబులెన్స్ సర్వీస్‌కు సమాచారం ఇచ్చినా వర్షాల కారణంగా చెట్లు కూలి అది చేరుకోని పరిస్థితి వచ్చింది. దీంతో 16 కిలోమీటర్లు ఆ గర్భిణి తీసుకెళ్లారు… అనంతరం అంబులెన్స్ ద్వారా 5 కిలోమీటర్ల దూరంలోని ఆస్పత్రికి చేర్చార...

ప్రపంచ కప్ క్రికెట్ లో మిథాలీ సేన విజయం కోరుతూ హోమం

Image
మిథాలీ సేన విజయం కోరుతూ హోమం ఢిల్లీ: మహిళల ప్రపంచకప్‌ ఫైనల్‌లో మిథాలీ సేన నేడు ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌ మైదానంలో తలపడనుంది. ప్రపంచకప్‌ టైటిల్‌కు ఇంకా ఒక్క అడుగు దూరంలో ఉన్న భారత మహిళల జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి దేశానికి కప్‌ తీసుకురావాలని దేశవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు. మిథాలీసేనకు శుభాకాంక్షలు చెబుతూ పలుచోట్ల ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. భారత జట్టు విజయాన్ని కాంక్షిస్తూ వారణాసిలో అభిమానులు భారీ హోమం నిర్వహించారు. హోమగుండం చుట్టూ జాతీయ జెండాలను చేతపట్టుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సెమీస్‌లో ప్రదర్శించిన దూకుడునే ఫైనల్‌లో ప్రదర్శించి కప్‌ గెలవాలని అభిమానులు కోరారు. రెండో సెమీస్‌లో ఆస్ట్రేలియాపై భారత్‌ ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ప్రపంచకప్‌ ఫైనల్‌లో రెండోసారి అడుగుపెట్టిన టీమిండియా ఈ సారి తప్పకుండా కప్‌ గెలవాలని పట్టుదలగా ఉంది.

అద్భుతం 2017, ఆగస్టు21న జరగబోతుంది: నాసా ప్రకటన

Image
విశ్వంలో జరిగే మార్పులు అన్నీ ఇన్నీ కావు. అలాంటి అరుదైన అద్భుతం 2017, ఆగస్టు21న జరగబోతుందని నాసా ప్రకటించింది. 99 సంవత్సరాల తర్వాత ఇలాంటి సంపూర్ణ సూర్యగ్రహణం రాబోతుందని తెలిపింది నాసా. అమెరికాలోని 14 రాష్ట్రాల్లో ఈ సూర్య గ్రహణం ఏర్పడనుంది.2017 ఆగస్టు 21న వచ్చే సూర్యగ్రహనం అరుదైనదని.. ఖగోళ అద్భుతంగా అభివర్ణించింది నాసా. మనిషి జీవితంలో ఒకసారి మాత్రమే లభించే అవకాశమని, 99 సంవత్సరాల్లో ఇది మొదటిదని చెప్పింది. సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో, సూర్యుడు, భూమికి మధ్య నుంచి చంద్రుడు దాటుతూ ఒకవైపు సూర్యుడు మొత్తం కప్పి వేయడంతో ఆకాశంలో కనిపించడని పేర్కొంది నాసా. గంటన్నర పాటు ఈ సూర్యగ్రహణం ఉంటుందట.ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఖగోళ అద్భుతాన్ని 300 మిలియన్ల కన్నా ఎక్కువ మంది వీక్షించనున్నట్లు అంచనా వేసింది నాసా. ఈ గ్రహణాన్ని వీక్షించాలనుకునేవారు సరైన భద్రత ప్రమాణాలను పాటించాలి. ముఖ్యంగా ఎక్లిప్‌ గ్లాసెస్ లేదా హ్యాండ్‌ హెల్డ్‌ సోలార్ వ్యూయర్ వంటి సౌర ఫిల్టర్లను మాత్రమే వాడాలని సూచించింది. గ్రహణం కారణంగా ఆగస్టు 21న అమెరికా అంతటా మిట్ట మధ్యాహ్నం సూర్యుడు మాయం కానున్నాడు. గ్రేట్ అమెరికన్ సోలార్ ఎక్లిప్స...

జర్నలిస్ట్ లకు ట్రిపుల్ బెడ్రూం ఇళ్ళు:చంద్రబాబు నాయుడు

Image
రాష్ట్రంలోని జర్నలిస్టులందరికి ట్రిపుల్ బెడ్‌రూమ్(3BK) ఇళ్ళలను నిర్మించి ఇస్తామని శనివారం నాడు నంద్యాలలో ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ చంద్రబాబు హామి ఇచ్చారు. దీనిపై జర్నలిస్ట్ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ట్రిపుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం చర్యలు సత్వరం చేపట్టాలని కోరారు.

డ్రగ్స్‌కు అనుమతిస్తే … లైసెన్స్‌లు రద్దు

Image
డ్రగ్స్‌కు అనుమతిస్తే … లైసెన్స్‌లు రద్దు హైదరాబాద్ : పబ్, బార్లు, ఫైవ్‌స్టార్ హోటళ్లలో డ్రగ్స్‌కు అనుమతిస్తే వాటి లైసెన్సులు రద్దు చేస్తామని ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ హెచ్చరించారు. హైదరాబాద్ జంటనగరాల్లోని కొన్ని పబ్‌లు, హోటళ్లు, బార్లు డ్రగ్స్‌ను అనుమతిస్తున్నట్టు అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలో శనివారం అకున్ సబర్వాల్ ఆయా యాజమాన్యాలతో సమావేశమయ్యారు. సుమారు రెండు గంటల సేపు ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పబ్‌లకు, హోటళ్లకు, బార్లకు డ్రగ్స్ విషయంలో అకున్ సబర్వాల్ మార్గ నిర్దేశనం చేశారు. తమ హోటళ్ల ముందు డ్రగ్స్‌ను నిషేధించినట్టు బోర్డులు పెట్టాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్, అదనపు కమిషనర్ రాజశేఖర్, హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు డ్రగ్స్ కేసు టాలీవుడ్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే. సినీ ప్రముఖులను రోజుకొకరి చొప్పున సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు జంట నగరాల్లోని పబ్‌లు, హోటళ్లు, బార్లపై ఆబ్కారీ శాఖ అధికారులు నిఘా పెట్టారు.

డ్రగ్స్ కేసులో ఎవరినీ టార్గెట్ చేయట్లేదు: ఆబ్కారీ కమిషనర్ చంద్రవదన్

Image
హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో ఎవరినీ టార్గెట్ చేయలేదని ఆబ్కారీ కమిషనర్ చంద్రవదన్ తేల్చి చెప్పారు. డ్రగ్స్ కేసులో ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సిట్ విచారణపై విమర్శలు చేయడం సరికాదని తెలిపారు. సినీ రంగంతో పాటు ఏ రంగం వారు ఈ కేసులో ఉన్నా వదిలే సమస్యేలేదని ఆయన చెప్పారు. సిట్ విచారణకు సినీప్రముఖులు సహకరిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నామని పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ బిజెపి కార్యవర్గ సమావేశాలు

Image
తెలంగాణ బిజెపి కార్యవర్గ సమావేశాలు వరంగల్ : తెలంగాణ బిజెపి కార్యవర్గ సమావేశాలు వరంగల్‌లో శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు రెండు రోజుల పాటు జరగనున్నాయి. ఈ సమావేశాలకు బిజెపి తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్రమంత్రి దత్తాత్రేయ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావుర, తెలంగాణ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి, నేత నాగం జనార్థన్‌రెడ్డి ,తెలంగాణ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. 2019లో తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్షంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి.

డ్రగ్ కేసుపై స్పందించిన రాంగోపాల్ వర్మ

Image
హైదరాబాద్: డ్రగ్ కేసుపై సోషల్ మీడియా ద్వారా స్పందించిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మొదట ఎక్సైజ్ ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ పై అమరేంద్ర బాహుబలిలా పేరు సంపాదిస్తున్నారంటూ వెటకారంగా మాట్లాడారు. అయితే ఇలా కామెంట్స్ చేసిన కొన్ని గంట వ్యవధిలోనే తన మాటమార్చుకున్నారు వర్మ. నేను అబ్కారీ శాఖ పనితనాన్ని, అకున్ వ్యక్తిత్వాన్ని కించపరచడం లేదని… కానీ డ్రగ్ కేసులో టాలీవుడ్ ను ఎక్సైజ్ శాఖ.. సినిమా టీజర్, ట్రైలర్ మాదిరిగా వాడుకుంటున్నారని విమర్శించారు. తాను మొదట పాఠశాల విద్యార్థులు డ్రగ్స్ వాడుతున్నారనే సమాచారంతో ఆశ్చర్యానికి గురయ్యానన్నారు. అయితే ప్రస్తుతం సినీ తారలను హైలైట్ చేస్తూ సాగుతున్న విచారణ.. ఆ తరువాత స్కూల్ విద్యార్థులను కూడా విచారిస్తార అని వర్మ ప్రశ్నించారు.

ఈ నెల 23వ తేదీ నుండి ట్యాబ్లేట్ కంప్యూటర్ ద్వారా ఓటర్ల నమోదు .

Image
ట్యాబ్లేట్ కంప్యూటర్ ద్వారా ఓటర్ల నమోదు ఈ నెల 23వ తేదీ నుండి నెల రోజుల పాటు హైదరాబాద్ నగరంలో ముమ్మర ఓటర్ల జాబితా సవరణ నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్ రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఓటర్ల నమోదు చేపడుతారని తెలిపారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్ నగరంలో మొట్టమొదటి సారిగా ఓటర్ల నమోదుకు వెళ్లే సిబ్బందికి ట్యాబ్లేట్ పిసిలను అందజేస్తున్నామని, ఇంటి వద్దే ఓటర్ల ఫోటోను తీసి జీపీఎస్ కు అనుసంధానం చేయడం వల్ల ఓటర్ల జాబితాలో ఎలాంటి అవకతవకలకు స్థానంలేదని పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ కు ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ను నమోదు చేస్తున్నామని, ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్లు టాబ్లేట్ కంప్యూటర్ల ద్వారా జరిగే ఓటర్ల నమోదును సరిచూస్తారని వివరించారు. ప్రతి పది పోలింగ్ స్టేషన్లకు ఒక పర్యవేక్షణ అధికారిని నియమించి బూత్లేవల్ అధికారుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారని తెలిపారు. ఓటర్ల నమోదు ప్రక్రియ మరింత పారదర్శకంగా సజావుగా కొనసాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు కూడా బూత్స్థ...

నగరంలోని రోడ్లపై గుంతలు లేకుండా ఎప్పటికప్పుడు పూడ్చి వేయాలి:కేటీఆర్

Image
జిహెచ్‌ఎంసి అధికారులతో కెటిఆర్ భేటీ హైదరాబాద్ : జిహెచ్‌ఎంసి, కాలుష్య నియంత్రణ మండలి,టిఎస్‌ఐఐసి అధికారులతో ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ శనివారం భేటీ అయ్యారు. నగరంలోని చెరువులు, కుంటల్లో కాలుష్య నియంత్రణపై వారితో సమీక్ష చేశారు. కాలుష్య రసాయనాలను అక్రమంగా చెరువుల్లోకి తరలించే పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. బయోమెడికల్, వ్యర్థాల నిర్వహణ సరిగా జరిగేలా అధికారులు పని చేయాలని ఆయన సూచించారు. నగరంలోని రోడ్లపై గుంతలు లేకుండా ఎప్పటికప్పుడు పూడ్చి వేయాలని కోరారు. ఈ భేటీలో నగర మేయర్ బొంతు రామ్మోన్ తదితరులు పాల్గొన్నారు.

మహేశ్‌బాబు కూతురు సితార బర్త్ డే సెలబ్రేట్

Image
బిజీబిజీగా ఉన్న టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు..తన కూతురు సితార బర్త్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు. కూతురు సితార ఐదవ బర్త్ డే సందర్భంగా ప్రిన్స్ తన ఇంట్లో ఈవెంట్‌ను ఏర్పాటు చేశాడు. నమ్రత, గౌతమ్‌తోపాటు మహేశ్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య సితార కేక్ కట్ చేసింది. 

నాగాలాండ్ ముఖ్యమంత్రి టీఆర్ జెలియాంగ్ అసెంబ్లీ బలపరీక్షలో విజయం

Image
కోహిమా: నాగాలాండ్ ముఖ్యమంత్రి టీఆర్ జెలియాంగ్ అసెంబ్లీలో శుక్రవారంనాడు జరిగిన బలపరీక్షలో నెగ్గారు. మొత్తం 59లో 47 మంది జెలియాంగ్‌కు మద్దతుగా నిలిచారు. రెండ్రోజుల క్రితం నాగాలాండ్ రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. శాసనసభలో బలపరీక్షకు ముఖ్యమంత్రి లీజిత్సు హాజరుకాకపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మాజీ సీఎం టీఆర్ జెలియాంగ్‌ను గవర్నర్ బీపీ ఆచార్య ఆదేశించారు. దీంతో కొత్త సీఎంగా జెలియాంగ్ ప్రమాణస్వీకారం చేశారు. ఈనెల 22లోగా శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోవాలని జెలియాంగ్‌ను గవర్నర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో జెలియాంగ్ శుక్రవారంనాడు జరిగిన బలపరీక్షలో తన ఆధిక్యాన్ని చాటుకున్నారు. కొద్దిరోజులుగా నాగాలాండ్ సంక్షోభం ముదిరిపాకాన పడుతూ వచ్చింది. 47 మంది ఎమ్మెల్యేలు తనకే మద్దతిస్తున్నందున ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని జెలియాంగ్ గవర్నర్‌కు లేఖ రాశారు. దీంతో జూలై 15లోపు అసెంబ్లీలో తన బలం నిరూపించుకోవాలని సీఎం తీజిత్సుకు గవర్నర్ చూపించారు. గవర్నర్ నిర్ణయాన్ని తీజిత్సు వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు. గువాహటిలోని కోహిమా బెంచ్ న్యాయస్థానం గవర్నల్ ఆదేశాలపై జూలై 17వరకూ స్టే ఇస...

రకుల్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..ఈసారి విజయ్ తో

Image
రకుల్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..! టాలీవుడ్ కోలీవుడ్ లలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ మరో క్రేజీ ఆఫర్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ కోలీవుడ్ స్టార్ హీరో సరసన నటించేందుకు అంగీకరించింది. ప్రస్తుతం మహేష్ బాబుతో స్పైడర్ సినిమాను తెరకెక్కిస్తున్న మురుగదాస్ తరువాత విజయ్ తో మరో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే విజయ్ హీరోగా తుపాకీ, కత్తి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన మురుగదాస్, మరో బిగ్ హిట్ మీద కన్నేశాడు. అయితే ఈసినిమాకు ముందుగా సమంతను హీరోయిన్ గా తీసుకోవాలని భావించారు. అయితే సమంత డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవటంతో ఆ ఛాన్స్ రకుల్ చేతికి వెళ్లింది. ప్రస్తుతం మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న స్పైడర్ సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది.

రైతులకు పంట రుణాలు త్వరితగతిన అందించాలి: జనగామ జిల్లా కలెక్టర్

Image
జనగామ: రైతులకు వారి పంట సాగుకు అవసరమైన రుణాలను అందించడంలో ఎటువంటి జాప్యం లేకుండా త్వరితగతిన ఇవ్వాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.శ్రీదేవసేన బ్యాంకర్లను కోరారు. వ్యవసాయ శాఖ, బ్యాంకు అధికారులను కలక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లాలో ఇప్పటి వరకు 32 వెల మంది రైతులకు 390 కోట్ల రూపాయలు రుణాలను రెన్యువల్ చేయడం, నూతనంగా 75 కోట్ల రూపాయలను కొత్తగా 3000 మంది రైతులకు పంట రుణాలను అందించడం జరుగిందని బ్యాంకర్లు కలెక్టర్ కి వివరించగా, అర్హులైన రైతులoదరికి రుణాలను అందిస్తే ప్రస్తుత తరుణoలో వారిని ఆదుకున్న వారవుతారని అన్నారు. పంట రుణాలను అందించడంలో వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి సమన్వయంతో పని చేయాలని బ్యాంకర్లను కలెక్టర్ కోరారు.  రైతులకు పంట రుణాలను అందించడంతో పాటు, స్వయం ఉపాధి కోసం నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం SC ,  BC, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా పెద్ద మొత్తంలో సబ్సిడీ పై రుణాలను మంజూరి చేస్తోందని, వారికి మంజరి చేసిన యూనిట్ల  గ్రౌండింగ్ గాను నుదులు విడుదల చేయలాని బ్యాంకర్లకు సూచించారు. మహిళాస్వయం సహాయక బృందాలు తమకిచ్చిన రుణాల ద్వారా ఆర్ధికోపాధి పొంద...

రిలయన్స్ జియో స్మార్ట్ ఫోన్ ఉచితం.. ధర రూ.0

Image
భారతీయులందరికీ రిలయన్స్ జియో స్మార్ట్ ఫోన్ ఉచితం.. ధర రూ.0 విశ్లేషకులు ముందుగా ఊహించినట్టుగానే, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అత్యంత చౌక ధరకు 4జీ ఫీచర్ ఫోన్‌ను విడుదల చేశారు. వాయిస్ కమాండ్‌తో కాల్స్, మెసేజ్‌లు చేసుకునేలా ఈ ఫోన్ ఉంటుందని తెలిపారు. కనెక్టివిటీ, అఫర్డబిలిటీ, డేటా స్పీడ్ ఆధారంగా ఫీచర్ ఫోన్‌ను తయారు చేశామని చెప్పారు. దేశంలో మొత్తం 78 కోట్ల మొబైల్ ఫోన్లు ఉండగా, వాటిల్లో 50 కోట్లకు పైగా ఫోన్లు ఫీచర్ ఫోన్లేనని గుర్తు చేసిన ముఖేష్ అంబానీ, వారందరినీ డిజిటల్ గొడుగు కిందకు తీసుకొచ్చారు. ఇందుకోసం భారతీయులందరికీ ఉచితంగా స్మార్ట్ ఫోన్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అయితే, సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.1500 చెల్లించాల్సి ఉంటుందనీ, ఈ మొత్తాన్ని మూడేళ్ళ తర్వాత పూర్తిగా తిరిగి ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఫీచర్ ఫోన్ యూజర్లు నిమిషం కాల్‌కు రూ.1.20 నుంచి రూ.1.50 వరకూ, ఒక జీబీ డేటాకు రూ.4 వేల నుంచి రూ.8 వేల వరకూ, ఎస్ఎంఎస్‌కు రూ.1 నుంచి రూ.1.50 చెల్లిస్తున్నారని గుర్తు చేసిన ఆయన, ఇకపై ఆ పరిస్థితి ఉండదని అన్నారు. వచ్చే 12 నెలల కాలంలో దేశంలోని 99 శాతం మందికి జియో సిగ్నల్స్ దగ...

రాష్ట్ర‌ప‌తి భ‌వ‌నం చ‌రిత్ర.

Image
14 వ రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికైన రామ్‌నాథ్ కోవింద్. కౌంటింగ్ లో భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు. త్వ‌ర‌లో ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం చెయ్య‌నున్నారు. ద‌ళిత‌ వ్య‌క్తిగా రాష్ట్ర‌ప‌తి భ‌వ‌నంలో ఆయ‌న త‌న అధికారాల‌ను నిర్వ‌హించ‌నున్నారు.కే.ఆర్ నారాయ‌ణ త‌రువాత‌ భార‌త రెండ‌వ ద‌ళిత వ్య‌క్తి రాష్ట్ర‌ప‌తి భ‌వ‌నం అడుగుపెట్ట‌నున్నారు. ఆయ‌న‌కు క‌ల్పించే స‌క‌ల స‌దుపాయ‌లు ఇప్పుడు చుద్దాం. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌నం చ‌రిత్ర. బ్రిటీష్ వైస్‌రాయ్ నివాసం కోసం 1911లో క‌ల‌క‌త్తాలో ఒక భ‌వ‌నాన్ని నిర్మించాల‌ని అనుకున్నారు. అయితే అప్పుడే ఢిల్లీ ద‌ర్బార్ వైభోగం గురించి విన్న బ్రిటీష‌ర్లు క‌లక‌త్తాలో నిర్మించాల్సిన వైస్రాయ్‌ భ‌వ‌నాన్ని ఢిల్లీకి మార్చారు. ఢిల్లీలో వైస్‌రాయ్ భ‌వ‌న నిర్మాణానికి 1911 నుండి 1916 వ‌ర‌కు భూసెక‌ర‌ణ జ‌రిగింది అప్పుడు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌నం గురించి 300 కుటుంబాల‌ను త‌ర‌లించారు. కానీ రాష్ట్ర‌ప‌తి భ‌వ‌నం (అప్పుడు వైస్రాయ్ భ‌వ‌నం అనే వారు) మాత్రం జూన్ 14, 1912లో క‌ట్ట‌డం ప్రారంభించారు. 400 ఎక‌రాల‌లో నిర్మాణం ప్రారంభించారు. ఈ భ‌వ‌నానికి బ్రిటీష్ ఆర్కిటెక్ ఎడ్విన్ లాన్సీర్ లాటియెన్స్ ప‌నిచేశారు. ఈ భ‌వ‌నాన...

శ్యామ్‌ కె.నాయుడి సిట్‌ విచారణ పూర్తి

Image
శ్యామ్‌ కె.నాయుడి సిట్‌ విచారణ పూర్తి డ్రగ్స్ వ్యవహారం లో నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు ఒక్కొక్కరు సిట్ ఆఫీస్ లో విచారణ ను ఎదురుకొంటున్నారు..నిన్న దాదాపు 11 గంటల పాటు డైరెక్టర్ పూరి ని విచారించి సిట్ అధికారులు , ఈరోజు కెమెరామెన్ శ్యామ్‌.కె.నాయుడు ను విచారిస్తున్నారు. ఉదయం 10 గంటలకు సిట్ ఆఫీస్ కు వచ్చాయని నాయుడు..10:30 నిమిషాలకు విచారణను మొదలు పెట్టారు..శ్యామ్‌.కె.నాయుడు తన న్యాయవాదితో కలిసి సిట్‌ ఎదుట హాజరయ్యారు. డ్రగ్స్‌ ముఠా నాయకుడు కెల్విన్‌తో ఉన్న సంబంధాలపైనే ఆరా తీసినట్టు తెలుస్తోంది. సాయంత్రం 4గంటల వరకు విచారించిన అధికారులు ఆయన ఇచ్చిన సమాచారంతో సంతృప్తి చెందినట్టు తెలుస్తోంది. కెల్విన్‌ ముఠాకు సంబంధించిన వివరాలు, మాదకద్రవ్యాలు కెల్వినే సరఫరా చేసేవాడా? లేదంటే దళారులతో సరఫరా చేసేవాడా? లాంటి ప్రశ్నల్ని అడిగినట్టు తెలుస్తోంది. విచారణ ముగిసిన అనంతరం కొద్దిసేపటి క్రితమే శ్యామ్‌ కె.నాయుడు సిట్‌ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయారు.

రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌కోవింద్ విజయం

Image
రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌కోవింద్ విజయం ఢిల్లీ : భారత రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ విజయం సాధించారు. 65.65 ఓట్ల శాతం మెజార్టీతో ఆయన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్‌పై విజయం సాధించారు. మీరాకుమార్‌కు 34.35 శాతం ఓట్లు లభించాయి. భారీ మెజార్టీతో రామ్‌నాథ్ కోవింద్ విజయం సాధించడంతో ఎన్‌డిఎ కూటమిలో ఆనందనం వెల్లువిరిసింది. ఈనెల 24వ తేదీతో ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పదవీకాలం ముగియనుంది. ఈనెల 25వ తేదీన భారత 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ బాధ్యతలు స్వీకరించనున్నారు. రామ్‌నాథ్ కోవింద్‌కు ఎన్‌డిఎ పక్షాలతో పాటు ప్రధాని మోడీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, టిఆర్‌ఎస్, టిడిపి, వైఎస్‌ఆర్‌సిపిలతో సహా పలు పార్టీలు అభినందనలు తెలిపాయి.

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌ ప్రమాదం

Image
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌ పెను ప్రమాదం నుండి తృటిలో తప్పించుకుంది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వం లో ‘మణికర్ణిక- ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ అనే మూవీ లో నటిస్తున్న సంగతి తెల్సిందే.. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్‌ జీవితాధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ మధ్యనే షూటింగ్ మొదలు పెట్టుకోగా , ప్రస్తుతం కంగనా తన సహనటుడు నిహర్‌ పాండేతో కత్తి సాము చేస్తుండగా కంగనా నుదురుపై కత్తి గాటు పడింది. దాంతో వెంటనే చిత్ర యూనిట్ ఆమెని అపోలో ఆస్పత్రికి తరలిచింది. కంగనా ముఖానికి 15 కుట్లు పడినట్లు చిత్ర యూనిట్ తెలిపారు. రెండు వారాల పాటు కంగనా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. కంగనాకు తృటిలో పెను ప్రమాదం తప్పిందని ఎముకకు దగ్గరగా కత్తి గుచ్చుకుందని డాక్టర్స్ చెప్పినట్లు తెలుస్తుంది. మాములుగా అయితే ఇలాంటి కత్తి సాములు ఎక్కువగా డూప్ సాయం తీసుకుంటారు కానీ.. కంగనా ఎలాంటి డూప్‌ లేకుండా చేస్తానని చెప్పిందని… కత్తిసాము చేయడానికి చాలాసార్లు ప్రయత్నించిందని.. ఈసారి గురి తప్పిందని నిర్మాత కమల్‌ జైన్‌ తెలిపారు.

అయ్యప్ప భక్తులకు శుభవార్త.. శబరిమల సన్నిధికి 48కి.మీ దూరంలో ఎయిర్‌పోర్ట్

Image
అయ్యప్ప భక్తులకు శుభవార్త.. శబరిమల సన్నిధికి 48కి.మీ దూరంలో ఎయిర్‌పోర్ట్ అయ్యప్ప భక్తులకు శుభవార్త. కేరళ సర్కారు అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం అయ్యప్ప సన్నిధికి 48 కిలోమీటర్ల దూరంలో ఎయిర్ పోర్టును ఏర్పాటు చేయనుంది. నవంబర్ నుంచి జనవరి మధ్య శబరిమలకు కోట్లాది మంది భక్తులు చేరుకుంటారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొట్టాయం జిల్లా కంజిరపల్లి తాలూకాలోని చెరువల్లీ ఎస్టేట్‌లో 2,263 ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టును నిర్మించేందుకు కేరళ సర్కారు శ్రీకారం చుట్టింది. ఇక ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే, శబరిమల ప్రయాణం మరింత సులువు కానుంది. ఈ ప్రాంతం రెండు జాతీయ రహదారులకు దగ్గరగా ఉండటంతో పాటు పీడబ్ల్యూడీ రోడ్డుకు దగ్గరగా ఉన్న కారణంగా ఇక్కడ ఎయిర్ పోర్టు నిర్మించాలని కేరళ సర్కారు భావిస్తోంది. ఈ ప్రాంతంలో ఎయిర్‌పోర్టును నిర్మించడం ద్వారా భక్తులు శబరిమలకు మరింత సులువుగా చేరుకునే అవకాశాలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం జరిగిన కేరళ మంత్రివర్గ సమావేశం విమానాశ్రయం నిర్మాణానికి ఆమోదం పలికింది. కాగా, ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే శబరిమలకు సమీపంలో ఎక్కడ విమానాశ్రయం నిర్మించవచ్చన్న వి...

శ్రీవారిని దర్శించుకున్న సచిన్

Image
శ్రీవారిని దర్శించుకున్న సచిన్ తిరుమల : మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం బాగా జరిగిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గురువారం జరిగే ఉమెన్స్ వరల్డ్ కప్ సెమి ఫైనల్స్‌లో పాల్గొనబోయే జట్టుకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీవారి దర్శనానంతరం టిటిడి అధికారులు రంగనాయకుల మండపంలో స్వామి వారి తీర్థ ప్రసాదాలు, పట్టు వస్త్రాలను సచిన్‌కు అందించారు.

రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు

Image
రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు  రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు పార్లమెంటులో గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభంకానుంది. ఓట్ల లెక్కింపు కోసం లోక్‌సభ సెక్రటరీ జనరల్ కార్యాలయం విస్తృత ఏర్పాట్లు చేసింది. అన్ని రాష్ర్టాల నుంచి బ్యాలెట్ బాక్సులను పకడ్బందీ భద్రత నడుమ ఢిల్లీకి తరలించారు. ఓట్ల లెక్కింపు కోసం నాలుగు టేబుళ్లను సిద్ధం చేశారు. మొత్తం ఎనిమిది రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగనుంది. ప్రతి రౌండ్‌లో లెక్కింపు ముగిసిన వెంటనే ఫలితాలను వెల్లడించనున్నట్లు లోక్‌సభ సెక్రటరీ జనరల్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి పదవి కోసం ఎన్డీఏ కూటమి తరఫున బీహార్ మాజీ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్, యూపీఏ కూటమి తరఫున లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ పోటీ పడ్డారు. ఈ నెల 18న పార్లమెంటుతో సహా అన్ని రాష్ర్టాల రాజధానుల్లో పోలింగ్ జరిగింది. దేశవ్యాప్తంగా మొత్తం 4,120 మంది ఎమ్మెల్యేలు, లోక్‌సభ, రాజ్యసభల ఎంపీలు 776 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా 99.14శాతం పోలింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే గెలుపొందిన అభ్యర్థికి లోక్‌సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా నియామక పత్రాన్ని అందజేస్తారు. 25న...

పరీక్షల ద్వారా వెల్లడయ్యే డ్రగ్స్‌ ఆనవాళ్లు

Image
పరీక్షల ద్వారా వెల్లడయ్యే డ్రగ్స్‌ ఆనవాళ్లు ఏ వ్యక్తి అయినా డ్రగ్స్‌ తీసుకున్నట్టు రుజువు చేయాలంటే అతడికి రక్త పరీక్షలు నిర్వహిస్తారు. అయితే రక్త నమూనాల్లో అంత పక్కాగా డ్రగ్స్‌ తీసుకున్న ఆనవాళ్లు రాకపోవచ్చని ఫోరెన్సిక్‌ వైద్య నిపుణులు చెబుతున్నారు. 15 రోజుల నుంచి నెల రోజుల క్రితం వరకు తీసుకున్న డ్రగ్స్‌ ఆనవాళ్లు మాత్రమే రక్త పరీక్ష ద్వారా దొరికే అవకాశం ఉందంటున్నారు. దేశవ్యాప్తంగా డ్రగ్‌ కేసుల్లో 20 శాతమే రుజువవుతున్నాయని ఫోరెన్సిక్‌ విభాగం గతంలోనే నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ)కి స్పష్టం చేసింది. సీడీఎఫ్‌డీ(కేంద్ర ఫోరెన్సిక్‌ డిపార్ట్‌మెంట్‌) అధికారులు మాత్రం.. తల వెంట్రుకలు, శరీరంపై రోమాలను పరీక్ష చేస్తే పక్కా ఆధారాలు లభిస్తాయని తెలిపారు. తల వెంట్రుకలను పరీక్ష చేస్తే 4 నెలల క్రితం వరకు డ్రగ్స్‌ తీసుకున్నా అందుకు సంబంధించిన ఆనవాళ్లు దొరుకుతాయన్నారు. అదే శరీరంపై ఉన్న రోమాలను పరీక్ష చేస్తే 260 రోజుల నుంచి 360 రోజుల క్రితం వరకు అంటే దాదాపు ఏడాది క్రితం డ్రగ్‌ తీసుకున్నా ఇట్టే పట్టేయవచ్చని పేర్కొంటున్నారు. దీనిద్వారా 90 శాతం కేసుల్లో పక్కా ఆధారాలు లభిస్తున్నాయని స్పష్టం చే...

ఏజీగా ప్రకాశ్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ

Image
ఏజీగా ప్రకాశ్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ హైదరాబాద్: హైకోర్టు ప్రాంగణంలోని తన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ (ఏజీ)గా దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ప్రకాశ్‌రెడ్డిని సన్మానించారు. సంఘం అధ్యక్షుడు జెల్లి కనకయ్య ఆధ్వర్యంలో జరిగిన సన్మానోత్సవంలో తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు చెందిన పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

తప్పుడు కథనాలతో నా జీవితాన్ని నాశనం చేశారు: పూరి జగన్నాథ్

Image
హైదరాబాద్‌: సంచలనం రేపిన డ్రగ్స్‌ కేసులో సిట్‌ విచారణపై దర్శకుడు పూరీ జగన్నాథ్‌ స్పందించారు. విచారణ అనంతరం ఎక్సైజ్‌ శాఖ కార్యాలయం నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన ఆయన.. బుధవారం రాత్రి 11గంటల తర్వాత తన ట్విట్టర్‌ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్‌ చేశారు. కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలు తను తీవ్రంగా బాధించాయని పూరీ జగన్నాథ్‌ అన్నారు. "తప్పుడు కథనాలతో నా జీవితాన్ని నాశనం చేశారు. మా ఫ్యామిలీ వాళ్లంతా ఏడుస్తున్నారు" అని పేర్కొన్నారు. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ అంటే తనకెంతో ఇష్టమని, అందుకే వాళ్లపై చాలా సినిమాలు తీశానని పూరీ చెప్పుకొచ్చారు. మీడియాలో అందరూ తనకు తెలిసినవాళ్లే అయినా, కష్టకాలంలో టార్గెట్ చేయడం బాధకలిగించిందని అన్నారు. వ్యక్తిగతంగా తాను బాధ్యతాయుతంగా ఉంటానని, డ్రగ్స్‌ విషయంలోనేకాదు మరే ఇతర విషయాల్లోనైనా ఇకపై జాగ్రత్తగా ఉంటానన్నారు.

తన కుమార్తెకు డ్రగ్స్‌తో సంబంధం లేదు:ఛార్మి తండ్రి దీప్‌ సింగ్‌ ఉప్పల్‌

Image
డ్రగ్స్‌ మాఫియా కేసులో నోటీసులు అందుకున్న వారిలో హీరోయిన్‌ ఛార్మి కూడా ఉన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఎక్సైజ్‌ అధికారులు గురువారం ఆమెను విచారించనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా డ్రగ్స్‌ వార్తలపై స్పందించారు ఆమె తండ్రి దీప్‌ సింగ్‌ ఉప్పల్‌. తన కుమార్తెకు డ్రగ్స్‌తో సంబంధం లేదని ఆయన అన్నారు. “13 యేళ్ల వయసు నుండే ఛార్మి సినీ రంగంలో ప్రతిభ చాటుతోందని, చిన్ననాటి నుంచే కుటుంబానికి అండగా ఉంటోందని అన్నారు. అలాంటిది తనపై వచ్చిన డ్రగ్స్‌ ఆరోపణలతో మాత్రం తీవ్రంగా కలత చెందిందని, ఒకవేళ చార్మీకి డ్రగ్స్‌ అలవాటు ఉంటే ఇంతకాలం ఇండస్ట్రీలో కొనసాగుతుందా? అని ప్రశ్నించారు. అలాగే ఛార్మీ తన తదుపరి చిత్రం పైసా వసూల్‌తో బిజీగా ఉందని, అయితే ఒకరిపై ఆరోపణలు చేస్తూ వార్తలు రాసేటప్పుడు వారి కుటుంబాలను దృష్టిలో పెట్టుకోవాలని తెలిపారు. తనకు దర్శకుడు పూరీ జగన్నాథ్‌ వ్యక్తిగతంగా తెలుసని, అతడు ఒక అద్భుతమైన దర్శకుడని, నిర్దోషిగా అతడు బయటకు వస్తారని పేర్కొన్నారు. డ్రగ్స్‌ కేసులో త్వరలోనే ఛార్మీకి క్లీన్‌చిట్‌ వస్తుందని అప్పుడే అందరికి సమాధానం దొరుకుందని వ్యాఖ్యానించారు.