Posts
Showing posts from 2017
జూరాల ప్రాజెక్టునుంచి 14,664 క్యూసెక్కుల నీరు విడుదల
- Get link
- X
- Other Apps
జూరాల ప్రాజెక్టునుంచి 14,664 క్యూసెక్కుల నీరు విడుదల గద్వాల : జూరాల ప్రాజెక్టునుంచి స్పిల్ వే ద్వారా 14 వేల 664 క్యూసెక్కుల నీటిని అధికారులు నేడు విడుదల చేశారు. ప్రాజెక్టు గేట్లు మూడు ఎత్తివేసి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 56 వేల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 61,229 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 5.9 టిఎంసిలు, పూర్తిస్థాయి నీటిమట్టం 9.6 టిఎంసిలు.
జర్నలిస్టు గౌరి లంకేష్ హంతకుల ఆచూకీ తెలిపితే రూ.లక్ష : రివార్డు కర్నాటక సర్కార్
- Get link
- X
- Other Apps
జర్నలిస్టు గౌరి లంకేష్ హంతకుల ఆచూకీ తెలిపితే రూ.లక్ష : రివార్డు కర్నాటక సర్కార్ బెంగళూరు : సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హంతకులు ఆచూకీ తెలిపిన వారికి లక్షరూపాయల రివార్డును కర్నాటక ప్రభుత్వం ప్రకటించింది. జర్నలిస్టు గౌరి హత్య కేసును ఇప్పటికే సిట్ కు అప్పగించిన ప్రభుత్వం, తాజాగా ఆమె హంతకులు ఆచూకీ తెలిపిన వారికి రూ. లక్ష రివార్డును ప్రకటించింది.
జర్నలిస్టుల వరుస హత్యలపై ఎన్‌ఐఏ విచారణ జరిపించాలి: మాయావతి
- Get link
- X
- Other Apps
జర్నలిస్టుల వరుస హత్యలపై ఎన్‌ఐఏ విచారణ జరిపించాలి: మాయావతి లక్నో: జర్నలిస్టుల హత్యల వెనుక పెద్ద కుట్ర ఉందని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి అన్నారు. ప్రముఖ జర్నలిస్టు,హేతువాది గౌరీ లంకేశ్ హత్యపై అమె అందోళన వ్యక్తం చేశారు. ఈ హత్యపై కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఐఏ విచారణకు అదేశించాలని అమె డిమాండ్ చేశారు. అలాగే గతంలో ఇదే తరహాలో హత్యలకు గురైన నరేంద్ర దబోల్కర్, గోవింద్ పన్సారే, ఎంఎం కల్బర్గీల,హత్యలపై కూడా ఎన్‌ఐఏతో విచారణ జరిపించాలని అన్నారు. కొద్ది కాల వ్యవధిలోనే జర్నలిస్టులు వరుసగా హత్యలకు గురవుతున్నారని,ఈ హత్యలకు గురవుతున్నారని, ఈ హత్యలను కేంద్ర ప్రభుత్వం కేవలం ఖండించడంతోనే చేతులు దులిపేసుకోకుండా వాటిపై సీరియస్‌గా దృష్టి సారించాలని ఆమె తెలిపారు.
వివాహేతర సంబంధం..భర్తను చంపిన భార్య
- Get link
- X
- Other Apps
వివాహేతర సంబంధం..భర్తను చంపిన భార్య వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తన ప్రేమకు భర్త అడ్డమని భావించిన ఆ మహిళా అతన్ని నమ్మించి కడతేర్చింది. పెళ్లై పట్టుమని మూడు నెలలు గడిచిందో లేదో కట్టుకున్న భార్యే, అతడిని కడతేర్చింది. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామానికి చెందిన చేగొండి భీమశంకరానికి, ద్రాక్షారామానికి చెందిన జయలక్ష్మీ ఈ ఏడాది మేలో వివాహమైంది. జయలక్ష్మీ ద్రాక్షారామంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తోంది. అయితే, అదే ఆసుపత్రిలో పనిచేసే సహోద్యోగి వీరేష్‌తో ఆమెకు పెళ్లికి ముందు నుంచే వివాహేతర సంబంధం ఉంది. దీంతో భర్త అడ్డం తొలగించేందుకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ చేసింది. పెళ్లై మూడు నెలలు గడిచిందో లేదో కట్టుకున్నవాడని కడతేర్చింది జయలక్ష్మీ. వీరేష్ తో కొనసాగిస్తున్న వివాహేతర సంబంధం తన భర్తకు తెలుస్తుందేమోనని భయపడుతూ గడిపింది ఆ మూడు నెలలు. ఇక తన ప్రేమాయణానికి భీమశంకరం అడ్డుకాకుడాదని భావించారు జయలక్ష్మీ, వీరేష్. దీంతో భర్తను నమ్మించి, భక్తి పేరుతో గుడికి తీసుకొచ్చి.. విషపూరి...
గ్రేటర్ హైదరాబాద్‌కు కేంద్ర పర్యాటక శాఖ అవార్డు
- Get link
- X
- Other Apps
గ్రేటర్ హైదరాబాద్‌కు కేంద్ర పర్యాటక శాఖ అవార్డు పర్యాటక ప్రాంతాల్లో GHMC కల్పించిన సౌకర్యాలకు కేంద్ర పర్యాటక శాఖ అవార్డు దక్కడం సంతోషంగా ఉందని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. ఈ అవార్డు తమపై బాధ్యతను మరింత పెంచిందన్నారు. అందరి సహకారంతోనే ఇది సాధ్యమైందని... రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ జనార్ధన్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఎన్ని అడ్డంకులు వచ్చినా సచివాలయం కడతాం: కర్నె
- Get link
- X
- Other Apps
ఎన్ని అడ్డంకులు వచ్చినా సచివాలయం కడతాం: కర్నె హైదరాబాద్: ప్రతిపక్షాలు నూతన సచివాలయాన్ని నిర్మించవద్దని అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఎవరెన్ని విధాలుగా ప్రయత్నించినా నిర్మించి తీరుతామని తెరాస ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఈ కార్యానికి ఎందుకు అడ్డుపడుతున్నాయో అర్ధం కావడం లేదని అన్నారు. ఇప్పుడున్న సచివాలయంలో కనీస వసతులు కూడా లేవన్నారు. బైసన్ పోలో మైదానం అందరికీ దగ్గరలో ఉంటుందని పైగా మెట్రో సదుపాయం కూడా ఉంటుందని తెలిపారు.
బీహార్ జర్నలిస్ట్ పంకజ్ మిశ్రాపై కాల్పులు
- Get link
- X
- Other Apps
బీహార్ జర్నలిస్ట్ పంకజ్ మిశ్రాపై కాల్పులు ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య ఉదంతం మర్చిపోక ముందే మరో జర్నలిస్ట్ పై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. బిహార్‌లోని అరవల్‌లో గురువారం జర్నలిస్ట్ పంకజ్ మిశ్రాపై ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో గాయపడ్డ పంజక్ మిశ్రా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా రాష్ట్రీయ సహారా దినపత్రికలో ఆయన పని చేస్తున్నారు. ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనంపై వచ్చి పంకజ్ మిశ్రాపై కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. అయితే పంజక్ మిశ్రా ఈరోజు మధ్యాహ్నం బ్యాంక్ నుంచి లక్ష రూపాయలు డ్రా చేసుకుని ఇంటికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దుండగులు కాల్పులు జరిపి, ఆయన వద్ద నుండి నగదు దోచుకెళ్లినట్లు అరవల్ ఎస్పీ వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిచెప్పేలా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించాల
- Get link
- X
- Other Apps
బతుకమ్మ పండుగకు ఘనంగా ఏర్పాట్లు ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకు తొమ్మిది రోజులపాటు నిర్వహించే బతుకమ్మ పండుగకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ అధికారులను ఆదేశించారు. బతుకమ్మ పండుగ నిర్వహణపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో హైదరాబాద్ లోని సచివాలయంలో ఆయన సమీక్ష జరిపారు. బతుకమ్మ పండుగ నిర్వహణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి తెలంగాణ రాష్ట్ర ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిచెప్పేలా ఉత్సవాలను నిర్వహించాలని చెప్పారు. ఈ నెల 26న దాదాపు 35 వేల మంది మహిళలతో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ ఉత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఎస్పీ సింగ్ ఆదేశించారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా ఈ నెల 28న వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మహిళలు బతుకమ్మలను హుస్సేన్ సాగర్ లో వదలడానికి ట్యాంక్ బండ్ పై ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా మహిళలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. తాత్కాలిక మరుగుదొడ్లు, రోడ్ల మరమ్మతులు, మంచినీటి సౌకర్యం వంటి పనులు చేపట్టాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సమగ్రమైన ప్రణాళిక రూపొందించాలని హైదరాబ...
91210 91210కు మిస్‌డ్ కాల్ ఇస్తే చాలు: ysrcp
- Get link
- X
- Other Apps
91210 91210కు మిస్‌డ్ కాల్ ఇస్తే చాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాంది పలికారు. ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా, పార్టీని బలోపేతం చేసేందుకు కొత్త పంథాను ఎన్నుకున్నారు. తాను ఇటీవల ప్రకటించిన నవరత్నాలు ప్రతి ఇంటికి తీసుకెళ్లే బాధ్యతను పార్టీ క్యాడర్‌పై పెట్టి వారి ద్వారా ప్రతి ఒక్కరిని పార్టీలో చేర్చుకునేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 91210 91210 నంబర్‌కు మిస్‌డ్ కాల్ ఇస్తే చాలు వారితో వైఎస్ జగన్ నేరుగా మాట్లాడేలా వాయిస్ రికార్డు చేశారు. ఆ తరువాత రెండు రోజుల్లోనే పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వైసీపీ సిబ్బంది ఫోన్‌లో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకునే ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి వైయస్ఆర్ కుటుంబం అనే పేరు పెట్టారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్ జగన్ ఇవాళ పులివెందులలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు ఇలా అం...
వైఎస్ఆర్‌కు కుటుంబ సభ్యుల నివాళి
- Get link
- X
- Other Apps
కడప: దివంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 8వ వర్ధంతిని ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, జిల్లా వైసీపీ నేతలు నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఇడుపులపాయకు వైఎస్ జగన్ చేరుకున్నారు. ఆయనతో పాటు వైఎస్ విజయలక్ష్మి, షర్మిల, అనిల్, వైఎస్ భారతి, ఎంపీ అవినాష్‌రెడ్డి ఇతర కుటుంబ సభ్యులు ఇడుపులపాయకు చేరుకున్నారు.
‘బోల్డ్.. ఒరిజినల్.. బ్రిలియంట్.. ‘అర్జున్ రెడ్డి’ -మహేష్ ట్వీట్
- Get link
- X
- Other Apps
హైదరాబాద్: విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ చిత్ర బృందాన్ని ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ప్రశంసించారు. చిత్రం కొత్త తరహాలో ఉందని, విజయ్ అద్భుతంగా నటించారని అన్నారు. కాగా సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఈ చిత్రాన్ని ఉద్దేశించి తాజాగా ట్వీట్ చేశారు. ‘బోల్డ్.. ఒరిజినల్.. బ్రిలియంట్.. ‘అర్జున్ రెడ్డి’ సాధారణ మార్గాన్ని బ్రేక్ చేసిన చిత్రం. విజయ్ దేవరకొండ లైఫ్‌టైమ్ పర్ఫామెన్స్‌తో వచ్చారు. అద్భుతంగా చేశారని చెప్పడం కూడా తక్కువే. షాలిని, ఆమె స్నేహితుల పాత్రలు బ్రిలియంట్‌గా ఉన్నాయి. సందీప్‌రెడ్డి వంగా రచన, దర్శకత్వం చాలా బావున్నాయి. ఇది ఆయన తొలి చిత్రమంటే నమ్మడం చాలా కష్టం. మీకు, మీ మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు’ అని మహేశ్ ట్వీట్ చేశారు.
మార్కెట్, ఎం.పి.డి.ఒ కార్యాలయ భవనాలను ప్రారంభించిన మండలి విప్
- Get link
- X
- Other Apps
కలెక్టర్ అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య
- Get link
- X
- Other Apps
బీహార్ క్యాడర్ కు చెందిన ఒక కలెక్టర్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ రైల్వే ట్రాక్ పక్కన ఆయన మృతదేహం లభ్యమైంది. ఆయన మృతదేహం పక్కన సూసైడ్ నోట్ లభించడంతో ఆత్మహత్యగా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఆయన ఆత్మహత్యకు కారణాలేమిటి? సుసైడ్ నోట్ లో ఢిల్లీలో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఉండగా, యూపీలోని ఘజియాబాద్ లో ఆయన మృతదేహం లభించడమేమిటి? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు
- Get link
- X
- Other Apps
న్యూఢిల్లీ : ఉప రాష్ర్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు రాజ్యసభ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. రాష్ర్టపతి భవన్ లోని దర్బార్ హాల్ లో ఉప రాష్ర్టపతిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నేరుగా పార్లమెంట్ కు చేరుకున్నారు వెంకయ్య. ఆ తర్వాత రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య ఆసీనులయ్యారు. రాష్ర్టపతి రామ్ నాథ్ కోవింద్.. వెంకయ్య చేత ప్రమాణస్వీకారం చేయించారు.
తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ మూడవ వార్షిక సమావేశంలో మంత్రి కేటీఆర్
- Get link
- X
- Other Apps
హైదరాబాద్: తాజ్‌డెక్కన్‌లో తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ మూడవ వార్షిక సమావేశంలో మంత్రి కేటీఆర్ గారు, మేయర్ బొంతు రామ్మోహన్ గారు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గారు మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంపై విస్తృతంగా చర్చ జరిగింది, తెలంగాణ వస్తే అభివృద్ధి కుంటుపడుతుందని అపోహలు సృష్టించరని, తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని కిరణ్‌కుమార్‌రెడ్డి బయపెట్టరని, రియల్‌ఎస్టేట్ పడిపోతదని అప్పటి నేతలు అన్నరని తెలిపారు. ఆదాయం వృద్ధి రేటు సహా 12 రంగాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉంది. హైదరాబాద్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీటి సరఫరా చేస్తున్నాం. హైదరాబాద్‌లో క్రైంరేటు గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు.
జనగామ: హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నా కలెక్టర్, ఎమ్మెల్యే
- Get link
- X
- Other Apps
మహిళల రక్షణకు హెల్ప్ లైన్ నంబర్:తెలంగాణ ప్రభుత్వం
- Get link
- X
- Other Apps
మహిళల రక్షణకు తెలంగాణ సర్కారు మరో ముందడుగు మహిళా సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇప్పటికే వారి రక్షణకు అనేక చర్యలు చేపట్టిన ప్రభుత్వం తాజాగా ఉమెన్ హెల్ప్ లైన్ సెంటర్ ను ఏర్పాటు చేయనుంది. ఈ నెల 15 స్వాతంత్య్ర దినోత్సవం నుండి ఈ హెల్ప్‌లైన్ నెంబర్ అందుబాటులోకి రాబోతోంది. ఒక్క పోన్ కాల్ తో తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు టోల్ ప్రీ నెంబర్ 181 కేటాయించింది ప్రభుత్వం.ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, మొదట హైదరాబాద్ లో పైలెట్ ప్రాజెక్టుగా చేపడుతోంది. సిటీలో మహిళలను బస్టాపుల్లో,రోడ్లపై, ఆపీసుల్లోను వేధింపులు ఎక్కువైన నేపథ్యంలో ఈ టోల్ ప్రీ నెంబర్ వారికి ఉపయోగంగా ఉండనుందని మహిళా రక్షణ కమిటీ సభ్యులు తెలిపారు.ఐటీ ప్రాంతాలపై ముఖ్యంగా దృష్టి పెట్టినట్లు వారు తెలిపారు. దశల వారిగా మిగతా జిల్లాకు దీన్ని విస్తరించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.పోకిరీల బారినుంచే కాకుండా అత్తమామలు, బంధువులు, ఇతర నేరస్థుల బారి నుంచి మహిళలను కాపాడేందుకు ఈ హెల్ప్‌లైన్ ఉపయోగపడనుంది.ఇప్పటికే షి టీమ్ లు కూడా మహిళారక్షణకు పనిచేస్తుండగా,దీన్ని అనుసంధానం చేసుకుని హెల్ప్ లైన్ సెంటర్ ప...
జోధ్‌పూర్ కోర్టుకు సల్మాన్ ఖాన్
- Get link
- X
- Other Apps
జోధ్‌పూర్ కోర్టుకు సల్మాన్ ఖాన్ జోధ్‌పూర్: అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇవాళ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ కోర్టుకు హాజరయ్యారు. ఈ ఏడాది జనవరిలో ఈ కేసులో సల్మాన్‌ను నిర్దోషిగా కోర్టు పేర్కొన్నది. అయితే 20 వేల బెయిల్ బాండ్‌పై సంతకం చేయాల్సి ఉన్న కారణంగా సల్మాన్ ఇవాళ కోర్టుకు వచ్చారు. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న సల్మాన్‌పై 1998 అక్టోబర్‌లో కేసు నమోదు అయ్యింది. .
డ్రగ్స్ లేడీ డాన్ సంగీత అరెస్టు
- Get link
- X
- Other Apps
డ్రగ్స్ లేడీ డాన్ సంగీత అరెస్టు హైదరాబాద్: డ్రగ్స్ లేడీ డాన్ సంగీతను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజులపాటు విచారించిన అధికారులు శుక్రవారం ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అయితే పోలీసుల విచారణలో పలు నిజాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. అలాగే సంగీతకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు కూడా వెలుగుచూశాయి.సంగీత డ్రగ్స్ సప్లయితో పాటు వ్యభిచారం కూడా నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అమ్మాయిల న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ సంగీత గత కొన్ని నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం కొనసాగిస్తున్నట్లు సమాచారం. ప్రియుడు జాన్ తో కలిసి సంగీత డ్రగ్స్ వ్యాపారం చేస్తోంది. నగర శివారు ప్రాంతాల్లోని ఇంజినీరింగ్ విద్యార్థులకు డ్రగ్స్ సప్లయి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఉచ్చులో బంజారాహిల్స్ కు చెందిన ప్రముఖుల పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆరుగురు వ్యాపారుల పిల్లలను పోలీసులు విచారించారు. అన్నారపు పవన్, సంగీతరెడ్డి, అమరసింహారెడ్డి, ఆకాశ్, సోమాయిల్ జాన్, అర్జున్ రెడ్డిలను పోలీసులు విచారించారు. వారి నుంచి రక్తపు నమూనాలను పోలీసులు సేకరించారు.
సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్ :లక్ష రూపాయల రివార్డు
- Get link
- X
- Other Apps
హైదరాబాద్: మాదక ద్రవ్యాల సరఫరాకు సంబంధించి సమాచారం అందించే వారికి లక్ష రూపాయల రివార్డు అందిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్ కేసులో విచారణను పారదర్శకంగా, చిత్తశుద్దితోనూ నిర్వహించాలని పోలీసు ఉన్నతాధికారులకు కేసీఆర్ సూచించారు. శుక్రవారం సాయంత్రం పోలీస్ శాఖ ఉన్నతాధికారులు అనురాగ్ శర్మ, సీపీ మహేందర్ రెడ్డి, అకున్ సబర్వాల్ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. డ్రగ్స్ కేసు దర్యాప్తు వివరాలను అధికారులు కేసీఆర్‌కు వివరించారు. కేసును పారదర్శకంగా, చిత్తశుద్ధితో నిర్వహించి సామాజిక రుగ్మతలను సంపూర్ణంగా రూపుమాపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ ఉన్నతాధికారులతో భేటీ అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. సినీ రంగాన్ని టార్గెట్ చేశారన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. డ్రగ్స్ సరఫరా, పేకాట క్లబ్బులు, గంజాయి సరఫరా, పోకిరీల ఆగడాలపై ప్రభుత్వానికి సమాచారం అందించే వారికి లక్ష రూపాయల రివార్డు అందించనున్నట్లు ప్రకటించారు.
క్రికెటర్ మిథాలీరాజ్ కు భారీ నజరానా:కేసీఆర్
- Get link
- X
- Other Apps
హైదరాబాద్: ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ కలిశారు. ఈ సందర్బంగా మిథాలీరాజ్‌కు రూ. కోటి బహుమానాన్ని కేసీఆర్ ప్రకటించారు. బంజారాహిల్స్‌లో 600 గజాలకు తక్కువ కాకుండా స్థలాన్ని కేటాయిస్తామన్నారు. మిథాలితో పాటుగా కోచ్ మూర్తికి రూ.25 లక్షల బహుమానం కేసీఆర్ ప్రకటించారు. వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌ను చూశానని, వరల్డ్‌కప్‌లో బాగా ఆడారంటూ మిథాలీరాజ్‌ను కేసీఆర్ అభినందించారు.
నిమ్మగడ్డ ప్రసాద్ భూములను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్
- Get link
- X
- Other Apps
హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ భూములను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. రూ. 148.89 కోట్ల విలువైన భూములను అటాచ్‌మెంట్ చేస్తూ ఈడీ శుక్రవారం ఉత్తర్వులను జారీచేసింది. జగన్ అక్రమాస్తులకు సంబంధించి వ్యాంపిక్ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ అప్పట్లో అరెస్టు అయిన విషయం తెలిసిందే.
పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కు ఎదురుదెబ్బ
- Get link
- X
- Other Apps
నవాజ్ షరీఫ్ పై అనర్హత వేటు ఇస్లామాబాద్: పనామా పేపరు కేసులో పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కు ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు ఆయనను ప్రధాని పదవీ నుంచి తొలగిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఆయనపై అనర్హత వేటును వేసింది. వెంటనే ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది. షరీఫ్ తోపాటు ఆయన కుటుంబ సభ్యులపై కూడా క్రిమినల్ కేసుకు కోర్టు ఆదేశించింది.
త్వరలో క్లౌడ్ హబ్ పాలసీ: మంత్రి లోకేష్
- Get link
- X
- Other Apps
గుంటూరు: మంగళగిరి పట్టణం మినీ అమీర్‌పేటగా మారుతుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మంగళగిరి కేంద్రంగా పలు ఐటీ శిక్షణా కేంద్రాలు రాబోతున్నాయని మంత్రి అన్నారు. అలాగే ప్రపంచస్థాయి ప్రమాణాలతో అవరావతికి డేటా సెంటర్ రావడం సంతోషకరంగా ఉందన్నారు. ఆగ్నేయాసియాలోనే అతిపెద్ద డేటా కేంద్రాల్లో ఒకటిగా నిలవనుందని, త్వరలో క్లౌడ్ హబ్ పాలసీ తీసుకురాబోతున్నామని ఆయన తెలిపారు. అంతేగాక రెండేళ్లలో లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఎలక్ట్రానిక్స్‌లో ఏపీ శరవేగంగా దూసుకుపోతోందని మంత్రి పేర్కొన్నారు.
నేటి నుండి పీకేఎల్ ఐదో సీజన్
- Get link
- X
- Other Apps
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని గచ్చిబౌలీ స్టేడియంలో శుక్రవారం పీకేఎల్ ఐదో సీజన్‌కు తెరలేవనుంది. గత నాలుగు సీజన్లలో పెద్ద సంఖ్యలో అభిమానుల్ని సంపాదించుకున్న పీకేఎల్ ఐదో సీజన్‌కు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమైంది. కొత్తగా 4 జట్లు చేరడంతో మొత్తం 12 జట్లు 13 వారాల పాటు 138 మ్యాచ్‌లతో హోరెత్తించనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ పట్నా పైరేట్స్ హ్యాట్రిక్‌పై కన్నేయగా.. జైపూర్ పింక్ పాంథర్స్, యు ముంబా రెండో టైటిల్‌పై గురిపెట్టాయి. తెలుగు టైటాన్స్, పుణెరి పల్టాన్, బెంగళూరు బుల్స్, దబాంగ్ ఢిల్లీ, బంగాల్ వారియర్స్ మొదటిసారి ట్రోఫీని ముద్దాడాలని ఉవ్విళ్ళూరుతుండగా.. తమిళ్ తలైవాస్, హరియాణా స్టీలర్స్, గుజరాత్ ఫార్చున్ జెయింట్స్, యూపీ యోధా అరంగేట్ర సీజన్‌లోనే అదరగొట్టాలని కృతనిశ్చయంతో బరిలో దిగుతున్నాయి. మరి ఏ జట్టు మెరుస్తుందో.. ఏ అభిమానులు మురుస్తారో అక్టోబరు 28న జరిగే ఫైనల్లో తేలిపోతుంది! ఆరంభోత్సవానికి తారలు: శుక్రవారం గచ్చిబౌలీ స్టేడియంలో తారల సందడి కనిపించనుంది. సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు పీకేఎల్ ఐదో సీజన్ ఆరంభ వేడుకలు జరుగనున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, తారల నృత...
విక్రమ్ గౌడ్ నోరు విప్పితే అన్ని వివరాలు బయటకు వస్తాయి:డీసీపీ
- Get link
- X
- Other Apps
హైదరాబాద్: మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్‌పై కాల్పుల జరిగాయని వెస్ జోన్ డిసిపి వెంకటేశ్వర్ రావు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. కుడి చేతి నుంచి ఎడిమ చేతి వైపు బుల్లెట్ దూసుకెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఇంటిలోకి ఎవరైనా వచ్చారా అని విచారణ చేస్తున్నామన్నారు. ఇప్పటికే నాలుగు పోలీస్ బృందాలను రంగంలోకి దించి విచారణ చేపట్టామన్నారు. విక్రమ్ గౌడ్ నోరు విప్పితే అన్ని వివరాలు బయటకు వస్తాయని చెప్పారు. విక్రమ్ గౌడ్‌కు వెపెన్ లైసెన్స్ లేదని డిసిపి పేర్కొన్నారు.
సిట్ అధికారులతో నటి ముమైత్ ఖాన్ విచారణ పూర్తి
- Get link
- X
- Other Apps
హైదరాబాద్ : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సిట్ అధికారులతో నటి ముమైత్ ఖాన్ విచారణ పూర్తి అయింది. గురువారం ఉదయం నాంపల్లి అబ్కారి కార్యాలయంలో విచారణకు హాజరయిన ఆమెను సిట్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మహిళ బృందం దాదాపు 6 గంటల పాటు విచారించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఛార్మి కౌర్‌ను విచారించినట్టుగానే ముమైత్‌ఖాన్ విచారణను కూడా సాయంత్రం 5 గంటలలోపే విచారణను ముగించారు.
మోహన్ లాల్, విశాల్ భారీ చిత్రం
- Get link
- X
- Other Apps
ఉన్ని కృష్ణన్ దర్శకత్వంలో మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రగా తెరకెక్కుతున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం విలన్ . మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తెలుగు నటుడు శ్రీకాంత్, తమిళ నటుడు విశాల్, హీరోయిన్ హన్సికలతో పాటు తెలుగు స్టార్ హీరోయిన్ రాశి ఖన్నా కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మూవీ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. విలన్ చిత్రంలో మోహన్ లాల్.. మాథ్యూ మనోరంజన్ అనే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఆయనకి భార్యగా మంజూ వారియర్ నటిస్తుంది.
డిప్యూటీ కలెక్టర్‌గా సింధు: చంద్రబాబు
- Get link
- X
- Other Apps
డిప్యూటీ కలెక్టర్‌గా సింధు: చంద్రబాబు హైదరాబాద్: రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్ 1 ఆఫీసర్‌గా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. 2016 రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు భారత్‌కు రజత పతకం అందించింది. ఈ నేపథ్యంలో పీవీ సింధుకు గ్రూప్-1 ఉద్యోగం ఇస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం చంద్రబాబు సింధుకు స్వయంగా ప్రభుత్వ ఉత్తర్వు కాపీని అందజేశారు. అనంతరం అపాయింట్‌మెంట్ లెటర్ అందజేస్తున్న ఫొటోను ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు. భవిష్యత్తులో దేశానికి సింధు మరింత ఖ్యాతిని తీసుకొస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన ట్వీట్‌లో ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం సింధు మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ కలెక్టర్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి నియామక పత్రం అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తన తొలి ప్రాధాన్యత బ్యాడ్మింటన్‌కేనని సింధు స్పష్టం చేసింది.
నితీశ్ నమ్మక ద్రోహి: లాలూ
- Get link
- X
- Other Apps
బీహార్: ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై ఆర్‌జెడి నేత లాలూ ప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. పదవి కోసం నితీశ్ ఎదైనా చేస్తారని తెలిపారు. తన పై వచ్చిన అవినీతి ఆరోపణల వెనుక నితీశ్ హస్తం ఉందని వెల్లడించారు. దేశ ప్రజలను బిజెపి మోసం చేస్తోందని దుయ్యబట్టారు. నితీశ్ నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి మోసాలను ప్రజల్లోకి వెళ్లి ఎండగడతామని లాలూ పేర్కొన్నారు.
అబ్దుల్ కలాం స్మారక మండపం ప్రారంభం
- Get link
- X
- Other Apps
తమిళనాడులోని రామేశ్వరంలో నిర్మించిన అబ్దుల్ కలాం స్మారక మండపాన్ని ప్రధాని నరేంద్రమోడీ గురువారం ఉదయం ప్రారంభించారు. రామేశ్వరం సమీపంలోని తంగచ్చిమఠం ప్రాంతంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమాధి ఉన్న విషయం తెలిసిందే. అక్కడ కేంద్ర ప్రభుత్వం పదిహేను కోట్ల వ్యయంతో కలాం స్మారక మండపాన్ని నిర్మించింది. గురువారం కలాం రెండో వర్ధంతి సందర్భంగా ఆయన స్మారక మండపాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. మండపంలో ఏర్పాటు చేసిన కలాం విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించారు. అనంతరం కలాం సమాధి వద్ద మోడీ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌డిఎ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు, తమిళనాడు ఇన్‌ఛార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావు, సిఎం పళనిస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఓటరు నమోదు లో కళాశాల ప్రిన్సిపల్స్ ముఖ్యపాత్ర వహించాలి
- Get link
- X
- Other Apps
జనగామ: కలక్టరేట్ లో డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్ తో బుదవారం నిర్వహించిన సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి మాలతి మాట్లాడుతూ ఓటర్ల నమోదు శాతం పెంచేందుకు తమతమ కళాశాలలో 18 సంవత్సరంలు వయస్సు నిండిన వారికి ఓటు హక్కు పై అవగాహన కల్పించాలని, అర్హత కల్గిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకునేందుకు, తద్వారా ఎన్నికలలో ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలని అన్నారు. ప్రతి కళాశాలలోను ఒక ఉపాధ్యాయునిని నోడల్ ఆఫీసర్ గా నియమించుకోవాలని, ఉత్సాహవంతులైన ఇద్దరు విద్యార్థులను ఓటర్ల నమోదుకు అంబాసిడార్లుగా నియమించుకోవాలని తెలిపారు. ప్రతి కళాశాలకు వారు కోరిన మేర కొత్తగా ఓటర్ల నమోడుకు అవసరమైన ఫారం-6, ఓటర్ల జాబితాలో తప్పొపులు సవరించేందుకు అవసరమైన ఫారం-8, పోలింగ్ స్టేషన్ల మార్పు చిరునామా మార్పుకు ఫారం-8Aలను ఇస్తామని ఆమె ఈ సందర్భంగా ప్రిన్సిపల్స్ కు తెలిపారు. తేది:01-01-2017 నాటికి 18 సంవత్సరాల వయస్సు, ఆ పైన వున్న వారందరు ఓటరుగా పేరు నమోదుకు అర్హులని అన్నారు. విద్యార్థుల భాగస్వామ్యం కోసం భారత ఎన్నికల సంఘం ఈ సంవత్సరం స్వీప్ (సిస్టమెటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టరోల్ పార్టిస...
వేధింపుల పర్వంలో మరో మలయాళ నటి మైథిలి ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్
- Get link
- X
- Other Apps
మళయాళీ హీరోయిన్ భావన వేధింపుల పర్వం కేసు విచారణలో ఉండగానే మరో కేసు బయటకు వచ్చింది.. మరో మళయాళ నటి మైథిలి న్యూడ్ ఫోటోలను ఒక ప్రొడక్షన్ ఎగ్జిక్యూటీవ్ ఏకంగా సోషల్ నెట్ వర్క్ లో పోస్ట్ చేశాడు.. ఈ విషయం తెలిసిన వెంటనే ఆ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది.. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.. ఈ కేసు గురించి పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ కిరణ్ కుమార్ దా దాపు పదేళ్లగా నటి మైథిలితో పరిచయం ఉంది..అతడు పెళ్లి అయిందనే విషయం దాచిపెట్టి ఆమెకు దగ్గరవాలని ప్రయత్నించాడు. చివరకు ఈ విషయం తెలిసిన ఆమె అతడిని దూరం పెట్టింది. దీంతో కిరణ్ కుమార్ ఆమెను అసభ్యంగా తీసిన న్యూడ్ ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టాడు. తాను కోరినంత డబ్బివ్వకపోతే ఈ ఫొటోలు నెట్ లో పెడతానంటూ బెదిరించాడు. ఆమె ఆ బెదిరింపులను లెక్క చేయకపోవడంతో ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడవి అక్కడ వైరల్ గా మారాయి. దీంతో నటి మైథిలి దీనిపై ఎర్నాకులం పోలీసులకు కంప్లయింట్ చేసింది.. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
డ్రగ్స్ కేసు సాయంత్రం 5 గంటలకు మీడియాకు వెల్లడి :ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్
- Get link
- X
- Other Apps
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ఐదో రోజు విచారణ ఇవాళ జరుగుతున్న విషయం తెలిసిందే. హీరో నవదీప్ ఇవాళ సిట్ ముందు హాజరయ్యాడు. అయితే.. డ్రగ్స్ కేసులో విచారణ కు సంబంధించిన వివరాలను సాయంత్రం 5 గంటలకు మీడియాకు వెల్లడిస్తామని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. ఇవాళ అకున్ సబర్వాల్, ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ అన్ని జిల్లాల ఎక్సైజ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. గుడంబా నిర్మూలన, పునరావాస చర్యలు, హరితహారంపై ఈ సందర్భంగా ఎక్సైజ్ అధికారులతో సమీక్షించామని అకున్ తెలిపారు.
అత్యంత ప్రియమైన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు: సమంత
- Get link
- X
- Other Apps
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భాంగా ప్రముఖ నటి తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ అయినా సమంత కేటీఆర్ ఫై పొగడ్తల వర్షం కురిపించింది. తన ట్విట్టర్ ద్వారా ‘‘అత్యంత ప్రియమైన నాయకుడికి శుభాకాంక్షలు. నిజమైన స్ఫూర్తి, నమ్మకం కలిగించే మీతో పరిచయం ఏర్పడడం గౌరవంగా భావిస్తున్నా సర్’’ అంటూ సమంత ట్వీట్ చేసి కేటీఆర్ తో పాటు తెలంగాణ ప్రజల మనసు దోచుకుంది. సమంత ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ‘‘మా చేనేత ప్రచారకర్తకు చాలా ధన్యవాదాలు. మీ ఫోకస్, డెడికేషన్‌తో నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చారు. వొవెన్2017(చేనేత వస్త్రాల ఫ్యాషన్ షో) కోసం ఎదురు చూస్తున్నా.’’ అని సమాధానం ఇచ్చారు. అందుకు సమంత ప్రతిస్పందిస్తూ ‘ధన్యవాదాలు సర్’ అని తెలిపింది.
హై కోర్టులో పిటిషన్ వేసిన ఛార్మి
- Get link
- X
- Other Apps
హై కోర్టులో పిటిషన్ వేసిన ఛార్మి ఈ మధ్య తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసులో కొంతమంది ప్రముఖుల పేర్లు వినిపించిన విషయం తెలిసిందే. అందులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ గారు, కథానాయకుడు రవితేజ, సుబ్బరాజు , తరుణ్ , నవదీప్, ఛార్మి, ముమైత్ ఖాన్ తదితరులు ఉన్న విషయం తెలిసిందే.కాగా కొన్ని రోజుల నుండి ఒక్కక్కరుగా సిట్ విచారణకు హాజరవుతున్న విషయం కూడా తెలిసిందే. ఇప్పటి వరకు పూరి, తరుణ్ ,శ్యామ్ కే నాయుడు , సుబ్బరాజు ,తరుణ్ తదితరులు విచారణకు హయరయ్యారు. కాగా ఈ విచారణపై దర్శకుడు పూరీ జగన్నాథ్ స్పందించారు. విచారణతరువాత ఎక్సైజ్ శాఖ కార్యాలయం నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన ఆయన తన ట్విట్టర్ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో మీడియా తన జీవితం నాశనం చేసింది అని చెప్పిన విషయం కూడా తెలిసిందే. కాగా ఆ తరువాత రోజు ఈ వీడియో పై నటుడు ప్రకాశ్ రాజ్ నిజానిజాలు తెలుసుకోకుండా ప్రచారం చేయడం తగదు అని స్పందించిన విషయం కూడా తెలిసిందే. కాగా ఈరోజు తాజాగా ఈ విషయం మీద కథానాయిక ఛార్మి హై కోర్టును ఆశ్రయించారు. విచారణలో తమ ప్రమేయం లేకుండా రక్త నమూనాలు సేకరిస్తున్నారని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 ప...