జర్నలిస్టుల వరుస హత్యలపై ఎన్‌ఐఏ విచారణ జరిపించాలి: మాయావతి

లక్నో: జర్నలిస్టుల హత్యల వెనుక పెద్ద కుట్ర ఉందని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి అన్నారు. ప్రముఖ జర్నలిస్టు,హేతువాది గౌరీ లంకేశ్ హత్యపై అమె అందోళన వ్యక్తం చేశారు. ఈ హత్యపై కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఐఏ విచారణకు అదేశించాలని అమె డిమాండ్ చేశారు. అలాగే గతంలో ఇదే తరహాలో హత్యలకు గురైన నరేంద్ర దబోల్కర్, గోవింద్ పన్సారే, ఎంఎం కల్బర్గీల,హత్యలపై కూడా ఎన్‌ఐఏతో విచారణ జరిపించాలని అన్నారు. కొద్ది కాల వ్యవధిలోనే జర్నలిస్టులు వరుసగా హత్యలకు గురవుతున్నారని,ఈ హత్యలకు గురవుతున్నారని, ఈ హత్యలను కేంద్ర ప్రభుత్వం కేవలం ఖండించడంతోనే చేతులు దులిపేసుకోకుండా వాటిపై సీరియస్‌గా దృష్టి సారించాలని ఆమె తెలిపారు.

Comments
Post a Comment