91210 91210కు మిస్‌డ్‌ కాల్‌ ఇస్తే చాలు: ysrcp



91210 91210కు మిస్‌డ్‌ కాల్‌ ఇస్తే చాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాంది ప‌లికారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే దిశ‌గా, పార్టీని బ‌లోపేతం చేసేందుకు కొత్త పంథాను ఎన్నుకున్నారు. తాను ఇటీవ‌ల ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాలు ప్ర‌తి ఇంటికి తీసుకెళ్లే బాధ్య‌త‌ను పార్టీ క్యాడ‌ర్‌పై పెట్టి వారి ద్వారా ప్ర‌తి ఒక్క‌రిని పార్టీలో చేర్చుకునేందుకు వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. 91210 91210 నంబ‌ర్‌కు మిస్‌డ్ కాల్ ఇస్తే చాలు వారితో వైఎస్ జ‌గ‌న్ నేరుగా మాట్లాడేలా వాయిస్ రికార్డు చేశారు. ఆ త‌రువాత రెండు రోజుల్లోనే పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి వైసీపీ సిబ్బంది ఫోన్‌లో మాట్లాడి వారి స‌మ‌స్య‌లు తెలుసుకునే ఏర్పాట్లు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి వైయ‌స్ఆర్ కుటుంబం అనే పేరు పెట్టారు. ఈ కార్య‌క్ర‌మాన్ని వైఎస్ జ‌గ‌న్ ఇవాళ పులివెందుల‌లో ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. చంద్ర‌బాబు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమ‌లు చేయ‌లేద‌న్నారు. రైతులు, డ్వాక్రా మ‌హిళ‌లు, నిరుద్యోగులు ఇలా అంద‌ర్ని మోసం చేశార‌ని మండిప‌డ్డారు. బాబు మూడేళ్ల‌ పాల‌న‌లో ఏ ఒక్క‌రు సంతోషంగా లేర‌న్నారు. నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాల‌న సువర్ణయుగంలా గడిచింద‌న్నారు. చంద్ర‌బాబు పాల‌న‌కు మార్కులు వేయించేందుకు పార్టీలోని బూత్‌ కన్వీనర్లకు పూర్తిగా శిక్షణ ఇచ్చి సెప్టెంబర్ 11 నుంచి అక్టోబ‌ర్‌2వ‌ తేదీ వ‌ర‌కు తిరుగుతార‌న్నారు. 20 రోజుల పాటు గ్రామంలోని ప్రతి ఇంటికి బూత్ క‌మిటీ స‌భ్యులు తిరిగి ఒక్కో ఇంట్లో కనీసం 20 నిమిషాలు గడిపి చంద్రబాబు అన్యాయాలపై మార్కులు వేయిస్తార‌ని వివ‌రించారు. మహానేత గురించి మరోసారి జ్ఞాపకం చేస్తార‌న్నారు. నవరత్నాలు పూర్తిగా అర్థమయ్యేలా వివరించాల‌ని సూచించారు. ఈ ప‌థ‌కాల‌పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. ఆ ఇంట్లో వారితో 91210 91210కు మిస్‌డ్‌ కాల్‌ ఇప్పిస్తే వారిని వైయస్‌ఆర్‌ కుటుంబ సభ్యులుగా చేర్చుతార‌ని, ఒక్కసారి మిస్‌డ్‌కాల్‌ ఇస్తే అది మన ఆఫీస్‌కు ఫోన్‌ వస్తుంది. మన ఆఫీస్‌నుంచి నేరుగా ఆ కుటుంబంతో రెండు రోజుల్లో ఫోన్‌లో మాట్లాడుతార‌న్నారు. ఫోన్‌ చేసిన వ్యక్తి ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యలను గుర్తించి..అధికారంలోకి వచ్చిన వెంటనే నెర‌వేరుస్తామ‌ని హామీ ఇచ్చారు.

ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తామని వైఎస్ జ‌గ‌న్‌ చెప్పారు. ఎవరికైనా ఏ సమస్య వచ్చినా ప్రజలు ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. గ్రామ సచివాలయంలో ఆ గ్రామస్తుల్లో పది మంది విద్యావంతులకు ఉద్యోగం ఇస్తామ‌న్నారు. ఎవరికి రేషన్‌కార్డు లేకపోయినా, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి సమస్యలు ఆ గ్రామంలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామ‌న్నారు. రాష్ట్రం మొత్తం వైయస్‌ఆర్‌ కుటుంబంలో సభ్యత్వం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు