వివాహేతర సంబంధం..భర్తను చంపిన భార్య
వివాహేతర సంబంధం..భర్తను చంపిన భార్య
వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తన ప్రేమకు భర్త అడ్డమని భావించిన ఆ మహిళా అతన్ని నమ్మించి కడతేర్చింది. పెళ్లై పట్టుమని మూడు నెలలు గడిచిందో లేదో కట్టుకున్న భార్యే, అతడిని కడతేర్చింది. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామానికి చెందిన చేగొండి భీమశంకరానికి, ద్రాక్షారామానికి చెందిన జయలక్ష్మీ ఈ ఏడాది మేలో వివాహమైంది. జయలక్ష్మీ ద్రాక్షారామంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తోంది. అయితే, అదే ఆసుపత్రిలో పనిచేసే సహోద్యోగి వీరేష్‌తో ఆమెకు పెళ్లికి ముందు నుంచే వివాహేతర సంబంధం ఉంది. దీంతో భర్త అడ్డం తొలగించేందుకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ చేసింది.
పెళ్లై మూడు నెలలు గడిచిందో లేదో కట్టుకున్నవాడని కడతేర్చింది జయలక్ష్మీ. వీరేష్ తో కొనసాగిస్తున్న వివాహేతర సంబంధం తన భర్తకు తెలుస్తుందేమోనని భయపడుతూ గడిపింది ఆ మూడు నెలలు. ఇక తన ప్రేమాయణానికి భీమశంకరం అడ్డుకాకుడాదని భావించారు జయలక్ష్మీ, వీరేష్. దీంతో భర్తను నమ్మించి, భక్తి పేరుతో గుడికి తీసుకొచ్చి.. విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి అడ్డం తొలగించుకుంది. భార్య అనే మాటకే కళంకం తెచ్చింది.
గతనెల 29న దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని నిర్మలగిరి క్షేత్రంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేయగా, ఒక్కోక్కటి వెలుగులోకి వచ్చాయి. మృతుడు తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామానికి చెందిన చేగొండి భీమశంకరంగా గుర్తించారు. ఇక, తీగ లాగితే వివాహేతర సంబంధమే ఈ మర్డర్ కు కారణమని తేలింది.
పోలీసులు ఈ కేసులో స్పీడు పెంచడంతో అనుమానాస్పద మృతి కాస్త మర్డర్ కేసుగా మారింది. నిర్మలగిరిలో దొరికిన డెడ్ బాడీ భీమశంకరందని తెలియడంతో పోలీసులు జయలక్ష్మిని తమ స్టైల్ లో విచారించారు. దీంతో అసలు గుట్టు రట్టయ్యింది. అమ్మగారి ప్రేమాయణం. ప్రియుడితో కలిసి వేసిన ప్లాన్లులు. కట్టుకున్న భర్తను కడతేర్చిన విధానం అంతా పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు జయలక్ష్మీతో పాటు ఆమెకు సహకరించిన వీరేష్‌ను కూడా అరెస్టు చేశారు.

Comments
Post a Comment