డ్రగ్స్ లేడీ డాన్ సంగీత అరెస్టు

డ్రగ్స్ లేడీ డాన్ సంగీత అరెస్టు

హైదరాబాద్: డ్రగ్స్ లేడీ డాన్ సంగీతను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజులపాటు విచారించిన అధికారులు శుక్రవారం ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అయితే పోలీసుల విచారణలో పలు నిజాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. అలాగే సంగీతకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు కూడా వెలుగుచూశాయి.సంగీత డ్రగ్స్ సప్లయితో పాటు వ్యభిచారం కూడా నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అమ్మాయిల న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ సంగీత గత కొన్ని నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం కొనసాగిస్తున్నట్లు సమాచారం.  ప్రియుడు జాన్ తో కలిసి సంగీత డ్రగ్స్ వ్యాపారం చేస్తోంది.
నగర శివారు ప్రాంతాల్లోని ఇంజినీరింగ్ విద్యార్థులకు డ్రగ్స్ సప్లయి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఉచ్చులో బంజారాహిల్స్ కు చెందిన ప్రముఖుల పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆరుగురు వ్యాపారుల పిల్లలను పోలీసులు విచారించారు. అన్నారపు పవన్, సంగీతరెడ్డి, అమరసింహారెడ్డి, ఆకాశ్, సోమాయిల్ జాన్, అర్జున్ రెడ్డిలను పోలీసులు విచారించారు. వారి నుంచి రక్తపు నమూనాలను పోలీసులు సేకరించారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు